హై-స్పీడ్ డేటాతో BSNL కొత్త ప్లాన్..

ABN , First Publish Date - 2021-09-01T01:59:06+05:30 IST

హై-స్పీడ్ డేటాతో BSNL కొత్త ప్లాన్..

హై-స్పీడ్ డేటాతో BSNL కొత్త ప్లాన్..

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 1,498 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో 365 రోజుల పాటు 2జీబీ హై-స్పీడ్ డైలీ డేటాతో ప్రారంభించబడిందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. 2జీబీ సీలింగ్ దాటితే బీఎస్ఎన్ఎల్ డేటా వేగాన్ని 40కేబీపీఎస్ వరకు తగ్గిస్తుంది. రూ. 1,498 బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. రూ. 2,399 ప్లాన్‌ను 425 రోజుల వరకు పొడిగించినట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

Updated Date - 2021-09-01T01:59:06+05:30 IST