1651 అడుగులకు చేరిన బీటీపీ నీరు

ABN , First Publish Date - 2021-11-29T05:57:04+05:30 IST

మండలంలోని భైరవానతిప్ప ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రానికి 1651 అ డుగుల మేర వరదనీరు చేరుకుంది.

1651 అడుగులకు చేరిన బీటీపీ నీరు
జలకళ సంతరించుకున్న భైరవానితిప్ప ప్రాజెక్టు

గుమ్మఘట్ట, నవంబరు 28: మండలంలోని భైరవానతిప్ప ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రానికి 1651 అ డుగుల మేర వరదనీరు చేరుకుంది. పది రోజులుగా ఎ గువనున్న కర్ణాటక ప్రాంతం నుంచి వేదావతి హగరి నది ద్వారా ప్రాజెక్టుకు వరదనీరు చేరుతుండటంతో  నీ టి సామర్థ్యం పెరిగింది. 1655 అడుగుల నీటి సామర్థ్యం తో వున్న ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటిమట్టం చేరేందుకు మరో నాలుగు అడుగులు మాత్రమే వుంది. వచ్చే రెండు రోజుల్లో కురిసే వర్షాలకు వరదనీటి ఇనఫ్లో పెరిగితే ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే ఆస్కారముంటుందని ఇరిగేషన, రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో  వేదావతి హగరి నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పెరగడంతో కుడి, ఎడమ కాలువల పరిధిలోని ఆయక ట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ప ర్యాటకుల తాకిడి రోజురోజుకు పెరగడంతో అధికారులు  సౌకర్యాలపై దృష్టిపెట్టారు. కుడి, ఎడమ కాలువల పరిధి లో సాగునీరు అందించేందుకు ముందస్తుగానే కాలువల మరమ్మతులు చేసుకోవాలని ఆయా గ్రామాల్లో రైతుల ను అప్రమత్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


‘జీడిపల్లి’లో 1.601 టీఎంసీల నీటి నిల్వ

బెళుగుప్ప, నవంబరు 28: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌లో ఆదివారం నాటికి 1.601 టీఎంసీల నీరు నిలువ వున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపా రు. ఇక్కడి నుంచి ఫేస్‌-2కు 200 క్యూసెక్కులు విడుదల చేయగా, మరువ ద్వారా 100 క్యూసెక్కులు నీరు పీఏబీ ఆర్‌కు వెళుతోందన్నారు. 


Updated Date - 2021-11-29T05:57:04+05:30 IST