Btpsలో యాసిడ్‌ ప్రమాదం

ABN , First Publish Date - 2022-03-08T18:35:53+05:30 IST

మణుగూరు ప్రాంతంలోని భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(బీటీపీఎస్‌)లోని 3, 4 కూలింగ్‌ టవర్లకు సంబంధించిన యాసిడ్‌ బాక్స్‌కు రంగులు వేస్తుండగా.. ప్రమాదవశాత్తు యాసిడ్‌లీకై కార్మికు డి

Btpsలో యాసిడ్‌ ప్రమాదం

- రంగులేస్తున్న కార్మికుడికి తీవ్ర గాయాలు

- హైదరాబాద్‌లో చికిత్స.. పట్టించుకోని సంబంధిత కంపెనీ

- ఫోన్‌లో విలేకరులకు తెలపడంతో ఆలస్యంగా వెలుగులోకి.. 


మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): మణుగూరు ప్రాంతంలోని భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(బీటీపీఎస్‌)లోని 3, 4 కూలింగ్‌ టవర్లకు సంబంధించిన యాసిడ్‌ బాక్స్‌కు రంగులు వేస్తుండగా.. ప్రమాదవశాత్తు యాసిడ్‌లీకై కార్మికుడి తీవ్రగాయాలపాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మణుగూరులోని అశోక్‌నగర్‌ ప్రాంతంలో నివాసముండే గొల్లపల్లి రఘు అనే కార్మికుడు శరీరం బాగా కాలిపోవడంతో.. వెంటనే స్థాని కులు, కుటుంబసభ్యులు భద్రాచలం ఆసుపత్రి అక్కడి నుంచి హైద్రాబాద్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం రఘు ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. అతడు పనిస్తున్న సంబంధిత వాసు కెమికల్స్‌ కంపెనీ కాంట్రాక్టర్‌, సూపర్‌వైజర్లు రఘుని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని కుటుంబసభ్యులు సోమవారం రాత్రి స్థానిక విలేకరులకు ఫోన్‌లో తమ ఆవేదన వెలిబుచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రఘును కాపాడాలంటే శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంటుందని, అందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారని, సూపర్‌వైజర్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి పారిపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కంపెనీ కార్మికుడు తీవ్ర గాయాలపాలైనా పట్టించుకోకుండా వ్యవహారిస్తున్న సదరు కాంట్రాక్టర్‌పై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - 2022-03-08T18:35:53+05:30 IST