బుచ్చిలో నేడు సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2021-07-24T05:23:11+05:30 IST

నిర్మాణాలు పూర్తి చేసుకున్న సెంట్రల్‌ లైటింగ్‌ నేడు (శనివారం) ప్రారంభానికి నోచుకోనుంది.

బుచ్చిలో నేడు సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవం
బుచ్చి బస్టాండ్‌ కూడలిలో మంత్రి రాక కోసం ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న, డీఎస్పీ

బుచ్చిరెడ్డిపాళెం, జూలై 23: నిర్మాణాలు పూర్తి చేసుకున్న సెంట్రల్‌ లైటింగ్‌ నేడు (శనివారం) ప్రారంభానికి నోచుకోనుంది. లైటింగ్‌ ప్రారంభించేందుకు పంచాయతీ రాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు శుక్రవారం నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. బుచ్చి నగర పంచాయతీతోపాటు మండలంలోని సుమారు రూ.28కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నగర పంచాయతీలో నిర్మాణం పూర్తైన రూ.2.70కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌, సిమెంటు రోడ్డు, రూ.40లక్షలతో సచివాలయ భవన ప్రారంభోత్సం, రూ.50లక్షలతో బెజవాడ గోపాల్‌రెడ్డి పార్కు స్థలంలో నుడా నిధులతో గ్రీన్‌ పార్కుకు భూమిపూజ జరుగుతుందన్నారు. అలాగే కాగులపాడు మార్గంలో రూ.1కోటితో నిర్మాణం పూర్తైన సిమెంట్‌రోడ్డు, రేబాలలో నిర్మాణం పూర్తైన పశువైద్యశాల ప్రారంభోత్సవం, అలాగే ఇంటింటికీ కొళాయి ఏర్పాటుకు రూ.23కోట్లతో జలజీవన్‌ భవన్‌ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు కమిషనర్‌ తెలిపారు.  


ఏర్పాట్లు పర్యవేక్షించిన  ఎమ్మెల్యే ప్రసన్న

శుక్రవారం సాయంత్రం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, డీఎస్పీ హరనాథ్‌రెడ్డి పలువురు నాయకులతో బుచ్చిలో మంత్రి సభ కోసం స్థానిక నాయకులు చేస్తున్న  ఏర్పాట్లను పరిశీలించారు. సెంట్రల్‌ లైటింగ్‌ పనులను ఆయన పర్యవేక్షించారు. ఎమ్మెల్యే వెంట కొండ్రెడ్డి రంగారెడ్డి, సూరా శ్రీనివాసులురెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, నగర కమిషనర్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో నరసింహారావు, వైసీపీ నాయకులు ఉన్నారు.


Updated Date - 2021-07-24T05:23:11+05:30 IST