
Visakha: ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని టీడీపీ state జనరల్ సెక్రటరీ బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఏపీ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనన్నారు. అన్ని ధరలూ పెంచి ప్రజలపై జగన్ భారం మోపారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్.. బీహార్‌ను మించిపోయిందని, ఈ ఘనత సీఎం జగన్‌దేనన్నారు. ఆంధ్రాలో దారుణమైన పరిస్థితులు చూడ్డానికి ఇక్కడికి రావాలని ఏపీ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామన్నారు.
సీఎం జగన్‌ను విజయ సాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించారు కాబట్టే...ఆయనకు పార్టీలో పెద్ద పదవులు ఇచ్చారని బుద్దా వెంకన్న ఆరోపించారు. మద్యం షాపులు దగ్గర గూగుల్ పే ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎక్కడా లేని పన్నులు వేస్తున్న జగన్ ఏపీకి ముఖ్యమంత్రా? లేక రాక్షసుడా? అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే లేరని బుద్దా వెంకన్న అన్నారు.
ఇవి కూడా చదవండి