బడ్జెట్ 2022 : నాలుగు అంశాలపై ప్రధాన దృష్టి

ABN , First Publish Date - 2022-02-01T16:50:49+05:30 IST

ప్రధాన మంత్రి గతి శక్తి మిషన్, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత

బడ్జెట్ 2022 : నాలుగు అంశాలపై ప్రధాన దృష్టి

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి గతి శక్తి మిషన్, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, ఆర్థిక పెట్టుబడులు- ఈ నాలుగు అంశాలపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభకు మంగళవారం చెప్పారు.  25,000 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.  కొత్తగా 400  వందే భారత్ రైళ్ళను ప్రారంభిస్తామన్నారు. 


చిరు ధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రసాయనాలు లేకుండా సాగు చేసే విధానాలను, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. రైతుల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించారు. భూముల రికార్డుల తయారీ  కోసం కిసాన్ డ్రోన్లను ఉపయోగిస్తామని చెప్పారు. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 9.2 శాతంగా అంచనా వేసినట్లు తెలిపారు. 


Updated Date - 2022-02-01T16:50:49+05:30 IST