అంతర్గత భద్రతకు పెద్దపీట

ABN , First Publish Date - 2022-02-02T08:28:32+05:30 IST

అంతర్గత భద్రతకు మోదీ సర్కారు పెద్దపీట వేసింది. ఈ సారి ఏకంగా రూ.1.85 లక్షల కోట్లు కేటాయించింది.

అంతర్గత భద్రతకు పెద్దపీట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అంతర్గత భద్రతకు మోదీ సర్కారు పెద్దపీట వేసింది. ఈ సారి ఏకంగా రూ.1.85 లక్షల కోట్లు కేటాయించింది. నిరుడు బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.20 వేల కోట్లు అధికం! కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో సింహభాగం కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌ కోసం వెచ్చించనున్నారు. ప్రధానంగా దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చనున్నారు. 2022-23 బడ్జెట్‌లో మొత్తం 1,85,776.55 కోట్లు కేటాయించారు. గతంతో పోలిస్తే ఇది దాదాపు 11.5ు అదనం. వివిధ కేటగిరీల బలగాలకు నిదుల కేటాయింపులు పెరగగా.. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ)కి మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఇక మహిళల భద్రతకు ఉద్దేశించిన ప్రత్యేక పథకాల అమలు కోసం రూ.200 కోట్లు కేటాయించారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణకు రూ.2744.52 కోట్లు, పోలీసు బలగాల ఆధునికీకరణకు రూ.2454.16 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. 

Updated Date - 2022-02-02T08:28:32+05:30 IST