కట్టడాల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-06-25T06:33:28+05:30 IST

గత మూడేళ్ళుగా రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో భవన నిర్మాణ రంగం కుదేలవుతుంది.

కట్టడాల్లేవ్‌!
ఇది రాజానగరం మండలంలోని జగనన్న లేఅవుట్‌ కాలనీ.. అధికారుల ఒత్తిడి కారణంగా చాలా మంది పునాది వరకూ వేసి ఇలా వదిలేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే రూ. 1.80 లక్షలతో పునాది దాటడం లేదు.

పునాది దాటని భవన నిర్మాణాలు

కొండెక్కిన భవన నిర్మాణ సామగ్రి

ఐరన్‌ టన్ను రూ.70 వేలు

తగ్గిన భవన నిర్మాణాలు

పునాదిలోనే జగనన్న కాలనీలు

ధరలపై కానరాని నియంత్రణ

లబోదిబోమంటున్న బిల్డర్లు 


అనపర్తి, జూన్‌ 24 : గత మూడేళ్ళుగా రోజు రోజుకు పెరుగుతున్న  ధరలతో  భవన నిర్మాణ  రంగం కుదేలవుతుంది. గతంలో ఉన్న ధరలకు ప్రస్తుత ధరలకు సంబంధం లేకపోవడంతో ఇల్లు కట్టడమే గగనంగా మారి పోయింది.  2020లో కరోనా వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. సైట్‌ను డవలప్‌మెంట్‌కు తీసుకుని పెట్టు బడులు పెట్టిన బిల్డర్లు తమ వాటాకు వచ్చిన అపార్టుమెంట్లు కొనే నాథుడు లేక పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందుల ఎదుర్కొంటున్నాడు. అంతే కాకుండా సామాన్య మఽధ్య తరగతి జనం ఇల్లు కట్టాలంటేనే భయ పడిపోతున్నారు. పెరిగిన ధరల్లో కట్టలేమని చెబుతున్నారు. 


ఐరన్‌ కొనలేం.. ఇసుక తీసుకురాలేం..


నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఐరన్‌ ధరలు అమాంతం పెరిగి పోవడంతో నిర్మాణ వ్యయం అంచనాలకు అందకుండా పోయింది. 2018 వరకు ఐరన్‌ టన్ను రూ.38 వేలు ఉండగా అది నేడు రూ.65 వేల నుంచి రూ.70 వేల వరకు పలుకుతుంది. అయితే మధ్యలో ఐరన్‌ ధర రూ. 98 వేల వరకూ పెరి గిపోయింది. చాలా కాలం అక్కడే నిలకడగా ఉండిపోయింది. ఆ తరువాత రూ. 93 వేల దగ్గర ఆగింది. ఇప్పుడు కాస్త తగ్గి రూ. 70 వేల వద్ద ఉంది. అయినా పేదోడు ఇల్లు కట్టాలంటే భారంగానే ఉంది. ఇసుక విషయానికి వస్తే ఐదు యూనిట్లు సుమారుగా రూ.6 వేల నుంచి రూ.7 వేలకు లభించేది. నేడు రూ.15 వేలు వెచ్చించాల్సి వస్తుంది. అదే  విధంగా రూ.10 నుంచి రూ. 12 వేలకు లభించే నల్ల కంకర నేడు రూ.16 నుంచి రూ.18 వేల  వరకు పలుకు  తోంది. రూ.5 వేలకు దొరికే ఇటుక నేడు రూ.8 వేల నుంచి రూ.9 వేలకు చేరుకుంది. బస్తా 250 పలికిన సిమెంట్‌ ధర నేడు రూ.350 నుంచి రూ. 400 ల వరకు విక్రరతుుస్తున్నారు. ఇక కూలీ రేట్ల విషయానికి వస్తే రూ. 600 ఉంటే మేస్త్రి కూలి నేడు రూ.800లకు చేరుకుంది. రూ. 500 ఉండే డైలీ లేబర్‌ కూలీ నేడు రూ. 650కు చేరుకుంది. ధరల పెరుగుదల కారణంగా భవన నిర్మాణ రంగం కుదేలైంది. నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. 


తగ్గిన భవన నిర్మాణాలు..


అపార్టుమెంట్ల నిర్మాణాలు  నిలిచిపోయాయి. పేదల ఇళ్లు ముందుకు సాగడం లేదు.  నియోజ కవర్గ కేంద్రమైన అన పర్తిలోనే అపార్టుమెంట్ల ప్లాట్‌లలో  అమ్మకానికి సిద్ధంగా సుమారుగా 500 నుంచి 600 వరకు  ఉన్నాయంటే ఇక జిల్లాలో ఎన్ని అపార్టుమెంట్లు అమ్మకాలకు ఎదురు చూస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు. జగనన్న కాలనీల్లో స్థలాలు పొందిన లబ్ధిదారుల పరిస్థితి మరోలా ఉంది. ప్రభు త్వం ఇచ్చిన  స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు సుమారుగా పది లక్షలు ఖర్చు అవుతుంది. కేవలం బేస్‌మెంట్‌ నిర్మా ణానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది.అయితే కనీసం బేస్‌మెంట్‌ పూర్తి చేయకపోతే స్థలాలు వెనుకకు తీసుకుం టామని అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో లబ్ధిదారులు అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ బేస్‌మెంట్‌ వరకు నిర్మాణాలు చేస్తున్నారు. ఇసుక, సిమెంట్‌, స్టీల్‌ తక్కువ ధరకు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో చేరడం లేదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం భవన నిర్మాణ సామగ్రి ధరలు నియం త్రిస్తే గాని నిర్మాణ రంగం పూర్వ స్థితికి చేరుకోలేదని పలువురు అంటున్నారు.


20 ఏళ్లలో ఈ ధరలు చూడలేదు..

బిల్డరుగా ఎన్నో అపార్టుమెంట్లు నిర్మాణం చేశా. ఈ మూడేళ్లలో  సుమా రుగా రూ. కోటి వరకు నష్టం  వచ్చింది.  గత 20 ఏళ్లగా నిర్మాణాలు చేస్తున్నా ఇటువంటి గడ్డు పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు.

- ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, అనపర్తి


Updated Date - 2022-06-25T06:33:28+05:30 IST