నిర్మించారు.. ప్రారంభం మరిచారు

ABN , First Publish Date - 2021-05-08T07:27:57+05:30 IST

ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతమైన మర్రిగూడ మండల కేంద్రంలో రూ.3.50కోట్ల వ్యయంతో మూడేళ్ల క్రితం నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.

నిర్మించారు.. ప్రారంభం మరిచారు

అలంకారప్రాయంగా మారిన 30పడకల ఆస్పత్రి

మర్రిగూడ, మే 7:  ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతమైన మర్రిగూడ మండల కేంద్రంలో రూ.3.50కోట్ల వ్యయంతో మూడేళ్ల క్రితం నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతమైన మర్రిగూడ మండలంలో అనునిత్యం ఫ్లోరోసి్‌సతో బాధపడుతూ కనిపిస్తుంటారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఆధునాతనమైన నూతన ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు ఏమోగాని ఈ ఆసుపత్రి ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతమైనందున ఇక్కడి ప్రజలు మెరుగైన వైద్యసేవలు పొందడం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి అనునిత్యం వస్తుంటారు. ఇప్పటివరకు ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో మెరుగైన వైద్యసేవలు అందుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి నాబార్డు నిధులతో నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వెంటనే ప్రారంభించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మర్రిగూడ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ రాజే్‌షను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఇది తమ పరిధిలోలేదని, జిల్లా వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు.


Updated Date - 2021-05-08T07:27:57+05:30 IST