బుల్ హవా... మరో ఏడాది..!

ABN , First Publish Date - 2021-06-22T23:14:06+05:30 IST

దశాబ్దమున్నర క్రితం(2003-08) నాటి ధోరణికి ప్రస్తుత భారత బుల్ మార్కెట్ అద్దం పడుతోందని గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.

బుల్ హవా... మరో ఏడాది..!

ముంబై : దశాబ్దమున్నర క్రితం(2003-08) నాటి ధోరణికి ప్రస్తుత భారత బుల్ మార్కెట్ అద్దం పడుతోందని గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. స్టాక్ మార్కెట్‌లొ మరో ఏడాది పాటు బుల్ హవా ఉంటుందని పేర్కొంది. గతేడాది మార్చి నెలలో నమోదయిన కనిష్ఠస్థాయి నుండి బుల్ మార్కెట్ ప్రారంభమైందని, ఇది ఇంకా కొంతకాలం పాటు కొనసాగుతుందని తాజా నివేదికలో పేర్కొంది.


ప్రస్తుత పరిస్థితుల్లో...  ఇన్వెస్టర్లు షేర్ల వ్యాల్యూను లెక్కించే సమయంలో పీఈ నిష్పత్తి కంటే ప్రైస్ టు బుక్ వ్యాల్యూను(పీబీవీ)ని పరిగణనలోకి తీసుకోవడం మేలు అని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. బుల్‌మార్కెట్‌లో గరిష్ఠంగా సగటు పీబీవీ 5.2 వరకు నమోదయినట్లు, ప్రస్తుతం ఇది 3.6 మాత్రమే ఉన్నట్లు తెలిపింది. గతంలో నాలుగు సందర్భాల్లో సగటున బుల్ మార్కెట్ 72 వారాలు ఉందని, ప్రస్తుత బుల్ మార్కెట్ 64 వారాలు పూర్తి చేసుకుందని తెలిపింది. ఇప్పుడు మరో ఏడాది పాటు దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్లిష్ ధోరణి కొనసాగ వచ్చునని అంచనా వేసింది. 

Updated Date - 2021-06-22T23:14:06+05:30 IST