Shocking video: వంతెన కూలుస్తుండగా ప్రమాదం.. ఒక్కసారిగా నీట మునిగిన బుల్డోజర్.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2022-09-27T02:35:05+05:30 IST
పాత వంతెనను కూల్చడానికి వెళ్లిన ఓ బుల్డోజర్ ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయి మునిగిపోయింది.
పాత వంతెనను కూల్చడానికి వెళ్లిన ఓ బుల్డోజర్ ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయి మునిగిపోయింది. దాని డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముజఫర్నగర్లోని జనసత్ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న వంతెనను కూల్చివేయడానికి బుల్డోజర్ వెళ్లింది.
వంతెనలోని ఒకవైపు భాగాన్ని బుల్డోజర్ కూల్చేసింది. అయితే ఆ భాగమే కాకుండా వంతెన మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ బుల్డోజర్ కూడా నీటిలో పడిపోయింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై తన ప్రాణాలను కాపాడుకుని ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా (Viral Video)మారింది.