బుల్లీబాయ్ యాప్ కేసు.. అదే అర్థం వచ్చే మరో యాప్‌ క్రియేటర్‌తో ప్రధాన నిందితుడికి లింక్!

ABN , First Publish Date - 2022-01-09T03:00:22+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుల్లీబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్‌కు అలాంటిదే

బుల్లీబాయ్ యాప్ కేసు.. అదే అర్థం వచ్చే మరో యాప్‌ క్రియేటర్‌తో ప్రధాన నిందితుడికి లింక్!

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుల్లీబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్‌కు అలాంటిదే మరో యాప్ అయిన ‘సుల్లీ డీల్స్’ క్రియేటర్‌తో సంబంధాలు ఉన్నట్టు విచారణలో బయటపడింది. ఈ యాప్‌ను దాదాపు ఏడాది క్రితం రూపొందించారు. దీనిని కూడా ఓపెన్ సోర్స్ హోస్టింగ్ అయిన గిట్‌హబ్‌లో నిర్వహించేవారు. ఈ యాప్‌పై అప్పట్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో కేసులు నమోదు కావడంతో ఆన్‌లైన్ నుంచి తొలగించారు. అయితే, ఆ కేసు మాత్రం పురోగతి లేకుండా అక్కడే ఆగిపోయింది.


బిష్ణోయ్ వెల్లడించిన వివరాలను ధ్రువీకరించుకునేందుకు ‘డీల్స్’ యాప్‌పై ఢిల్లీలోని  కిషన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బిష్ణోయ్ అరెస్ట్‌తో బుల్లీబాయ్ యాప్‌లోల వందలాదిమంది ముస్లిం మహిళల వేలం కోసం జాబితా చేసిన కేసును పరిష్కరించినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. భోపాల్‌లోని జోర్హాత్‌కు చెందిన బిష్ణోయ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన నాలుగో నిందితుడు నీరజ్. 


ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతితోనూ టచ్‌లో ఉన్నట్టు నీజర్ పోలీసులకు తెలిపాడు. ట్విట్టర్ గ్రూప్ చాట్స్ ద్వారా కమ్యూనికేట్ అయ్యేవాడినని పేర్కొన్నాడు అయితే, తానెప్పుడూ వారిని కలవలేదని, వారి కాంటాక్ట్ నంబర్లు కూడా లేవని చెప్పాడు. కాగా, ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరిలో ఒకరైన శ్వేతాసింగ్ ట్విట్టర్ ఖాతాను నీరజ్ ఉపయోగిస్తున్నాడు.


పోలీసుల అదుపులో ఉన్న నీరజ్ విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెండుసార్లు తనకు తాను హాని తలపెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2022-01-09T03:00:22+05:30 IST