ఆలీకి CM YS Jagan బంపరాఫర్‌..!?

ABN , First Publish Date - 2022-02-11T08:05:34+05:30 IST

సినీ నటుడు ఆలీకి బంపరాపర్‌ దక్కనుంది. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై జరిగిన చర్చల కోసం గురువారం ఇక్కడకు వచ్చిన ఆలీని వారంరోజుల తర్వాత..

ఆలీకి CM YS Jagan బంపరాఫర్‌..!?

వారం తర్వాత వచ్చి కలవమన్న సీఎం జగన్‌ 

రాజ్యసభ సీటు ఇచ్చేందుకేనన్న ఊహాగానాలు


అమరావతి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు ఆలీకి బంపరాపర్‌ దక్కనుంది. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై జరిగిన చర్చల కోసం గురువారం ఇక్కడకు వచ్చిన ఆలీని వారంరోజుల తర్వాత తనను కలవాలని సీఎం జగన్‌ సూచించారు. దీంతో ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరో 3నెలల తర్వాత ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు ఎంపిక కానున్నారు. అందులో ఒక సీటు మైనార్టీలకు ఇచ్చే ఆలోచనలో ఉన్న జగన్‌... ఆ అవకాశం ఆలీకి కల్పించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


గత ఎన్నికల సందర్భంగా రాజమండ్రి అసెంబ్లీ టికెట్‌ ఆశించిన ఆలీకి ఆ అవకాశం దక్కలేదు. అయినా వైసీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండున్నరేళ్లుగా పదవి కోసం ఎదురు చూస్తున్న ఆలీ పేరు ఇటీవల ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సందర్భంగా ప్రచారంలోకి వచ్చినా అప్పుడూ నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు రాజ్యసభకు పంపే అవకాశముందన్న చర్చ జోరందుకుంది. ఈ విషయమై ఆలీని సంప్రదించగా ‘సీఎం తర్వాత కలవమన్నారు.. ఏమిస్తారో నాకు తెలీదు’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-11T08:05:34+05:30 IST