రిజర్వేషన్లపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-12T20:51:27+05:30 IST

ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి స్పష్టమైన విధానంతో ముందుకు పోవాలని..

రిజర్వేషన్లపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి స్పష్టమైన విధానంతో ముందుకు పోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆర్టీసీ కల్యాణమండపంలో బీసీ విద్యావంతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బండి సంజయ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ ఓబీసీ వ్యక్తిని గుజరాత్‌కు ముఖ్యమంత్రిని చేస్తే అభివృద్ధి చేసి చూపించారు. నరేంద్రమోదీ గుజరాత్‌ను అభివృద్ధి చేయడంతో బీజేపీ దేశ ప్రధానిని చేసింది.


మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఓబీసీలకు అనుకూలం.బీసీ కమిషన్‌కు బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా కల్పించింది. అబద్ధాలలో కేసీఆర్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎన్నికలు వస్తే కేసీఆర్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీలు గుర్తుకు వస్తారు.మేధావి వర్గం మౌనం వహిస్తుంది.. ఇది అవినీతిపరులకు ఆయుధంగా మారింది.ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు.ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కేసీఆర్ కనీసం పది కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు.మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ఓబీసీల రిజర్వేషన్లు నిర్వీర్యం అవుతున్నాయి.కటిక కులస్తులు నిర్వహించాల్సిన మటన్ దుకాణాలు ఎవరూ నిర్వహిస్తున్నారు? ఇమ్రాన్, సలీం పేర్లతో మటన్ షాపులు నడుస్తున్నాయి.బంగారు దుకాణాలు, ఫ్యాన్సీ స్టోర్లు కూడా ముస్లింలు నిర్వహిస్తున్నారు. బీసీలకు తీవ్ర నష్టం కలుగుతుంది’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-12T20:51:27+05:30 IST