
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ(congress)కి దమ్ముంటే భాగ్యలక్ష్మి దేవాలయం మీద చేయి వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) సవాల్ విసిరారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయన్నారు. భాగ్యలక్ష్మీ దేవాలయం లేదనేవాడు మూర్ఖుడని మండిపడ్డారు. అమ్మవారి శక్తిని తాము.. గుర్తించాము కాబట్టే.. ఇప్పుడు మసీదు గుర్తొచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ నేతల సంతకాల సేకరణను ముస్లిం సమాజం కూడా హర్షించదన్నారు. చార్మినార్ను తొలగించాలని తాము ఎప్పుడూ చెప్పలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి