AP News: కర్నూలు: నేడు దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-05T12:14:39+05:30 IST

దేవరగట్టు (Devaragattu)లో బుధవారం బన్నీ ఉత్సవాలు (Bunny Festival) జరగనున్నాయి.

AP News: కర్నూలు: నేడు దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు

కర్నూలు (Kurnool): దేవరగట్టు (Devaragattu)లో బుధవారం బన్నీ ఉత్సవాలు (Bunny Festival) జరగనున్నాయి. దేవరగట్టు అంటేనే గుర్తుకొచ్చేది దసరా పర్వదినాన అర్ధరాత్రి జరిగే జైత్ర యాత్ర. అదే కర్రల సమరం.  మూడు గ్రామాల భక్తులు.. దేవుడిని వశపరుచుకోడానికి తలపడటమే  బన్నీ ఉత్సవం. అసురులపై దేవతలు సాధించిన విజయానికి గుర్తుగా జైత్రయాత్ర (బన్నీ) ఉత్సవం జరుపుకుంటున్నారు. త్రేతాయుగం నుంచి ఈ ఆనవాయితీ వస్తోందని దేవరగట్టు సమీప గ్రామాల భక్తుల నమ్మకం. ఈసారి కూడా దసరా సందర్భంగా బన్ని ఉత్సవాన్ని  ఘనంగా జరిపాలని నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామాల భక్తులు ఏర్పాట్లు చేశారు.


బుధవారం అర్ధరాత్రి కర్రల సమరం జరగనుంది. అయితే బన్నీ ఉత్సవంలో కర్రలను అరికట్టేందుకు దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దాదాపుగా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ.. 144 సెక్షన్ విధించారు. దేవరగట్టు ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫాల్కన్ వాహనం ద్వారా నిఘా పెట్టారు. దేవరగట్టు బన్నీ ఉత్సవాలను తిలకించేందుకు రెండు లక్షల మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2022-10-05T12:14:39+05:30 IST