బన్నీ ఉత్సవాలు రద్దు: మంత్రి జయరాం

ABN , First Publish Date - 2020-10-26T21:13:52+05:30 IST

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బన్నీ ఉత్సవాలు రద్దు చేశామని మంత్రి జయరాం తెలిపారు. బన్నీ ఉత్సవం రద్దుతో ఎలాంటి అరిష్టం వాటిల్లదని చెప్పారు.

బన్నీ ఉత్సవాలు రద్దు: మంత్రి జయరాం

కర్నూలు: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బన్నీ ఉత్సవాలు రద్దు చేశామని మంత్రి జయరాం తెలిపారు. బన్నీ ఉత్సవం రద్దుతో ఎలాంటి అరిష్టం వాటిల్లదని చెప్పారు. అర్ధరాత్రి దేవరగట్టులో కర్రల సమరం జరగదని, శాస్త్రోక్తంగా పూజలు, ఉత్సవ క్రతువు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జయరాం ప్రకటించారు.


కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రభుత్వం రద్దు చేసింది. అధికారులు అన్ని గ్రామాల్లో తిరిగి అవగాహన కల్పించారు. 144 సెక్షన్‌ కూడా విధించారు. ఏటా విజయదశమి నాడు జరిగే బన్ని ఉత్సవాన్ని ఈ ఏడాది నిర్వహించవద్దని అధికారులు విన్నవిస్తున్నారు. కొవిడ్‌ అవాంతరాలు లేకపోతే ఈ నెల 26 అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరిగేది. బన్ని ఉత్సవం తప్ప మిగిలిన పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రకటించింది. దేవరగట్టులో కర్రల సమరం రద్దు  నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులు దేవరగట్టు విధుల్లో ఉన్నారు. దేవరగట్టు ఆలయ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్, ఫాల్కాన్ వాహనాలతో నిఘా నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2020-10-26T21:13:52+05:30 IST