స్కైలైన్‌ వ్యూని ఎంజాయ్‌ చేస్తున్న బన్నీ!

Published: Thu, 27 Jan 2022 23:55:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
స్కైలైన్‌ వ్యూని ఎంజాయ్‌ చేస్తున్న బన్నీ!

‘పుష్ప’ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. దుబాయ్‌ స్కైలైన్‌ వ్యూని ఎంజాయ్‌ చేస్తూ స్టైలిష్‌గా ఫోటోకు ఫోజులిచ్చాడు. ఈ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అవుతోంది. విహారయాత్ర నుంచి రాగానే బన్నీ ‘పుష్ప–2’ చిత్రీకరణతో బిజీ అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International