తూర్పు ఇబ్రహీంపట్నం బాదుడే బాదుడులో దేవినేని ఉమా
మాజీ మంత్రి దేవినేని ఉమా
ఇబ్రహీంపట్నం, జూలై 5: జగన్రెడ్డి అసమర్థ పాలనవల్లే ప్రజలపై భారాలు పడ్డాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం బాదుడే బాదుడు తూర్పు ఇబ్రహీంపట్నం వార్డు కౌన్సిలర్ చనమోలు నారాయణరావు నేతృత్వంలో ఆయన పాల్గొని ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంటిపన్ను, ఆస్తిపన్ను, డీజిల్, పెట్రోల్, గ్యాస్ అడ్డంగా పెంచేసి ప్రజల నడ్డివిరిచిందన్నారు. జగన్రెడ్డి బాదుడుకు ప్రజలు విలవిలలాడుతున్నారన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు రామినేని రాజశేఖర్, జంపాల సీతారా మయ్య, చుట్టుకుదురు శ్రీనివాసరావు, కామినేని అనిల్, కరిమికొండ శ్రీలక్ష్మీ, ముప్పసాని భూలక్ష్మీ, మైలా సైదులు, ముప్పతల గోపాలరావు పాల్గొన్నారు.