బురేవి.. భయం

ABN , First Publish Date - 2020-12-04T05:00:11+05:30 IST

మొన్న నివర్‌.. ఇప్పుడు బురేవి జిల్లావాసుల్లో వణుకు పుట్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ (బురేవి) ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

బురేవి.. భయం
నెల్లూరు : బాలాజీనగర్‌లో ఓ ఇంటిలోకి చేరిన నీటిని తోడేస్తున్న మహిల

మళ్లీ జిల్లావాసులను వణికిస్తున్న వరుణుడు

తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షం

నెల్లూరులో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం


నెల్లూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : మొన్న నివర్‌.. ఇప్పుడు బురేవి జిల్లావాసుల్లో వణుకు పుట్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ (బురేవి) ప్రభావంతో  జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లా సరాసరి 18.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా ఇందుకూరుపేట మండలంలో 91.8 మి.మీ, కోవూరులో 90.2 మి.మీ, విడవలూరులో 69.8 మి.మీ, కొడవలూరులో 51.2 మి.మీ, నెల్లూరులో 44.6 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురవడంతో నగరంలోని శివారు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మనుబోలు, తోటపల్లిగూడూరు, నాయుడుపేట తదితర మండలాల్లో వరినారు నీట మునిగింది. చెరువులు నిండిపోయి కలుజులు పారుతున్నాయి.  





Updated Date - 2020-12-04T05:00:11+05:30 IST