వంటలు

కావలసినవి: కొబ్బరి తురుము - మూడు కప్పులు, చిక్కటి పాలు (కండెన్స్‌డ్‌ మిల్క్‌)  - అర లీటరు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, నెయ్యి - మూడు టీస్పూన్లు.


తయారీ విధానం: వెడల్పుగా, మందంగా ఉన్న పాన్‌ తీసుకుని పాలు పోసి వేడి చేయాలి. అందులో కొబ్బరి తురుము కూడా వేసి చిన్న మంటపై మరిగించాలి. మిశ్రమం కొద్దిగా చిక్కగా అయ్యాక యాలకులపొడి, నెయ్యి వేయాలి. మరో రెండు మూడు నిమిషాలు ఉడికించి స్టవ్‌పై నుంచి దింపాలి. ఈ మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగంలో ఎరుపు రంగు ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి. వెడల్పాటి ప్లేట్‌ తీసుకుని అందులో ఫుడ్‌ కలర్‌ వేసిన మిశ్రమం పోయాలి. తరువాత దానిమీద ఫుడ్‌ కలర్‌ కలపని మిశ్రమం పోయాలి. ఇప్పుడు బర్ఫీని ఫ్రిజ్‌లో ఒక గంటపాటు పెట్టుకోవాలి. తరువాత మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌ చేసుకుని అందించాలి. వీటిని పిల్లలు పెద్దలూ ఇష్టంగా తింటారు. 


Follow Us on:
`
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.