
కావలసినవి : రాగిపిండి - ఒక కప్పు, నెయ్యి - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీస్పూన్, సిల్వర్ పేపర్ - ఒకటి, బెల్లం తురుము - ఒక కప్పు, మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ - రెండు టేబుల్‌స్పూన్లు, పాలు - అరకప్పు.
తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి నెయ్యి వేసి చిన్న మంటపై కరిగించాలి. నెయ్యి కరిగిన తరువాత రాగి పిండి వేసి వేయించాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. రాగి పిండి రంగు మారిన తరువాత స్టవ్ పైనుంచి దింపుకొని పదినిమిషాలు చల్లారబెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై మళ్లీ పెట్టి అందులోనే బెల్లం తురుము వేసి వేయించాలి. యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. బెల్లం కరుగుతున్న సమయంలో కలియబెడుతూ ఉండాలి. తరువాత కొన్ని గోరువెచ్చని పాలు పోసి మరోసారి కలుపుకొంటే రాగి మిశ్రమం రెడీ.చివరగా ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి రాసి అందులో రాగి మిశ్రమం పోయాలి. డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవాలి. చల్లారిన తరువాత కట్ చేసుకుంటే నోరూరించే రాగి బర్ఫీలు రెడీ.