గోశాల గడ్డివాములు దగ్ధం

ABN , First Publish Date - 2021-04-18T05:00:03+05:30 IST

నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలోని గోశాలకు చెం దిన గడ్డివాములు దగ్ధమయ్యాయి.

గోశాల గడ్డివాములు దగ్ధం


 నందికొట్కూరు రూరల్‌, ఏప్రిల్‌ 17:
నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలోని గోశాలకు చెం దిన గడ్డివాములు దగ్ధమయ్యాయి. రూ. 2 లక్షల దా కా  నష్టం జరిగింది. బాధితుడు గోశాల శ్రీనివాసులు  మాట్లాడుతూ.. తనకు దాదాపుగా 400 ఆవులు వున్నాయని, వీటిపైననే ఆధారపడి జీవిస్తున్నానని అన్నారు.  శనివారం రాత్రి రెండు గంటల సమయంలో గడ్డివాముల నుంచి మంటలు చెలరేగి తెల్లవారు జామువరకు కాలాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారని తెలిపారు. రూ. 2 లక్షల దాకా నష్టం వాటిల్లిందని అన్నారు.  గ్రామ సర్పంచ్‌ రవియాదవ్‌ మాట్లాడు తూ గడ్డివాములు కాలిపోవడం వల్ల  ఆవులకు పశుగ్రాసం కొరత తీవ్రమవుతుందన్నారు. బాధితుడికి తహసీల్దార్‌ ఆర్థిక  సాయం చేయాలని కోరాడు.  

Updated Date - 2021-04-18T05:00:03+05:30 IST