షార్ట్‌ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం

ABN , First Publish Date - 2021-12-05T04:58:49+05:30 IST

చింతకుంట గ్రామంలో శనివారం మధ్యాహ్న సమయంలో షార్ట్‌ సర్య్కూట్‌తో గుడిసె దగ్ధమైంది.

షార్ట్‌ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం

కోసిగి, డిసెంబరు 4: చింతకుంట గ్రామంలో శనివారం మధ్యాహ్న సమయంలో షార్ట్‌ సర్య్కూట్‌తో గుడిసె దగ్ధమైంది. పులుసు పెద్ద తిక్కయ్య అనే రైతుకు చెందిన గుడిసెకు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా నిప్పు చెలరేగింది. వ్యవసాయ పనిముట్లు, ఎరువుల బస్తాలు, నిత్యావసర సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. మంటలు చెలరేగిన సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బాధితుడిని ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-12-05T04:58:49+05:30 IST