కాలిన హైమాస్ట్‌ లైట్లు, వీధి దీపాలు

ABN , First Publish Date - 2021-06-18T06:58:57+05:30 IST

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని దైర్యపురితండా గ్రామపంచాయతీలో హైమాస్ట్‌ స్తంభానికి విద్యుత తీగలు తగలడంతో మూడు హైమాస్ట్‌ లైట్లతోపాటు గ్రామంలోని వీధి దీపాలు కూడా కాలిపోయాయి.

కాలిన హైమాస్ట్‌ లైట్లు, వీధి దీపాలు
హైమాస్ట్‌లైట్ల పైనుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత వైరు

హైమాస్ట్‌ లైట్ల మీదుగా 11కేవీ వైర్లు వెళ్లడంతో ప్రమాదం
రెండు రోజులుగా వీధుల్లో వెలగని దీపాలు
చింతపల్లి, జూన 17:
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని దైర్యపురితండా గ్రామపంచాయతీలో హైమాస్ట్‌ స్తంభానికి విద్యుత తీగలు తగలడంతో మూడు హైమాస్ట్‌ లైట్లతోపాటు గ్రామంలోని వీధి దీపాలు కూడా కాలిపోయాయి. గ్రామంలో ఐదు సంవత్సరాల క్రితం హైమాస్ట్‌ లైట్లను  ప్రారంభించారు. సంవత్సరం క్రితం వింజమూరి స్టేజీ నుంచి దేవులతండా స్టేజీ వరకు 11 కేవీ విద్యుతలైనను అమర్చారు. దైర్యపురి తండాలో ఉన్న హైమాస్ట్‌ లైట్ల మీదుగానే 11 కేవీ విద్యుత వైర్లు ఉన్నాయి. నాలుగు రోజులుగా మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతుండడంతో 11కేవీ విద్యుత వైరు హైమాస్ట్‌ స్తంభానికి తగిలింది. దీంతో హైమాస్ట్‌ స్తంభానికి ఉన్న మూడు హైమాస్ట్‌ లైట్లతోపాటు గ్రామం లోని 15వీధి దీపాలు కూడా కలిపోయాయి. రెండు రోజులుగా హైమాస్ట్‌ లైట్లు, వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని విద్యుతను పునరుద్ధరిం చాలని స్థానికులు కోరుతున్నారు.
విద్యుత అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు
వింజమూరితండా గ్రామపంచాయతీలో ఉన్న హైమాస్ట్‌ లైట్‌ పైనుంచి 11కేవీ లైనను మార్చాలని పలుమార్లు విద్యుత అధికారుల దృష్టికి తెచ్చాను. గాలి దుమారం వచ్చినప్పుడల్లా ప్రమాదం సంభవిస్తుందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. రూ.75వేల వి లువజేసే హైమాస్ట్‌ లైట్లు, వీధి దీపాలు కాలిపో యాయి.  ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
ఎ.బాల్‌సింగ్‌నాయక్‌, దైర్యపురితండా సర్పంచ.

Updated Date - 2021-06-18T06:58:57+05:30 IST