ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2020-11-27T05:50:29+05:30 IST

హైదరాబాద్‌ నుంచి మార్కాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ దయ్యాలగండి వద్ద గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
లోయలోకి వెళ్లిన ఆర్టీసీ బస్సును లాగుతున్న క్రేన్‌

లోయలోకి దూసుకెళ్లి ఆగిన వైనం 

37 మందితో హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన బస్సు

నాగార్జునసాగర్‌ దయ్యాలగండి వద్ద ఘటన

నాగార్జునసాగర్‌, నవంబరు 26: హైదరాబాద్‌ నుంచి మార్కాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ దయ్యాలగండి వద్ద గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ శీనయ్య తెలిపిన వివరాల ప్రకారం టీఎస్‌08 జడ్‌ 0061 నెంబర్‌ గల ఆర్టీసీ బస్సు దిల్‌సుఖ్‌నగర్‌ డిపో నుంచి 37మంది ప్రయాణికులతో గురువారం ఉదయం మార్కాపురం బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో సాగర్‌ సమీపంలోని దయ్యాలగండి వద్దకు వచ్చేసరికి వర్షం వస్తుండడంతో రోడ్డు పక్కన బురద ఉండడంతో బస్సు అదుపు తప్పింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో ఆగిపోయింది. అరగంట సేపు ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బస్సులోనే కూర్చున్నారు. డ్రైవర్‌ సాగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వెంటనే అక్కడిని చేరుకున్న పోలీసులు లోయ వద్ద ఆగిఉన్న బస్సును క్రేన్‌ సహాయంతో పక్కకు తీశారు. బస్సులో ఉన్న ప్రయా ణికుల్లో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. 


చికిత్సపొందుతూ విద్యార్థి మృతి 

మర్రిగూడ, నవంబరు 26: ఆన్‌లైన్‌ తరగతులను సరిగా వినడంలేదని తండ్రి మంద లించినందుకు ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెం దాడు.  ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండలం కుదా భక్షుపల్లి గ్రామానికి చెందిన రమావత్‌ పాండు కమ్మగూడెంలో బొగ్గుబట్టీలు నిర్వహి స్తున్నాడు. పాండు కుమారుడు ప్రవీణ్‌కుమార్‌నాయక్‌ (18) కమ్మగూడెంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ తరగతులను సరిగా వినడంలేదని, ఇంటి పనులను కూడా సక్రమంగా చేయడంలేని ప్రవీణ్‌కుమార్‌ను ఈనెల 12వ తేదీన తండ్రి మం దలించి బొగ్గుబట్టీలో పనిచేయడానికి తీసుకువెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రవీణ్‌కుమార్‌ నాయక్‌ సమీపంలోని పత్తి చేనులో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహ త్యాయత్నం చేసి తన అన్నకు ఫోన్‌ చేశాడు. కుటుంబసభ్యులు ప్రవీణ్‌నాయక్‌ను హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు.  


రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

తిప్పర్తి, నవంబరు 26: కూలి పనులు కోసం వచ్చిన కుటుంబం కుమారుడిని కో ల్పోయింది. తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన మోటం సైదులు కుటుంబం  త్రిపురా రంలో కొంత కాలంగా నివసిస్తోంది. పత్తి తీసేందుకు సైదులు నెలరోజుల క్రితం కుటు ంబంతో  తిప్పర్తి మండలం యాపలగూడెం గ్రామానికి  వలస వచ్చాడు. కూలి పనులు ముగిసిన  అనంతరం గురువారం  ట్రాలీ  ఆటోలో ఐదుగురు కుటుంబ సభ్యులు త్రిపు రారం వెళుతుండగా మార్గమధ్యలో తిప్పలమ్మగూడెం వద్ద ఎదురుగా వస్తున్న పత్తి ట్రాక్టర్‌  ఢీకొట్టింది. దీంతో ఆటోఆటో వెనుక నిలుచొని ఉన్న సైదులు కుమారుడు సురేష్‌ (15) పక్కకు ఒరిగాడు. ఈ ఘటనలో ఆటోలోని ఇనుపరాడ్‌ బలంగా తగలడంతో తలకు తీవ్ర గాయమైన సురేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సురేష్‌ తండ్రి సైదులు  ఫిర్యాదు మేరకు ట్రాక్టర్‌ డ్రైవర్‌ చిమట శంకర్‌పై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. 

Updated Date - 2020-11-27T05:50:29+05:30 IST