బస్సుచార్జీలను తగ్గించాలి: టీడీపీ

ABN , First Publish Date - 2022-07-03T05:48:59+05:30 IST

పెంచిన బస్సుచార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నాయకులు శ నివారం పలమనేరు-మదనపల్లె రహదారిలో గంగ వరం పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ధర్నా చేశారు. ఆర్టీసీ బస్‌ఛార్జీల పెంపుతో సామాన్య జనంపై వైసీపీ ప్రభుత్వం భారం మోపుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు మండిపడ్డారు.

బస్సుచార్జీలను తగ్గించాలి: టీడీపీ
గంగవరంలో రోడ్డుపై ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

గంగవరం, జూలై 2: పెంచిన బస్సుచార్జీలు  తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నాయకులు శ నివారం పలమనేరు-మదనపల్లె రహదారిలో గంగ వరం పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ధర్నా  చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు సోమశేఖర్‌ మాట్లాడుతూ... ప్రభుత్వం ఉన్నఫలంగా బస్సు ఛార్జీ లు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు విపరీతంగా పెంచి వాహనదారులను కొల్లగొడుతోం దన్నారు.   పెరిగిన నిత్యావసరాలు, పెట్రో, డీజిల్‌, బస్సు, కరెంట్‌ చార్జీలు, చెత్తపై పన్ను... ఇలా సా మాన్య ప్రజానీకంపై బాదేస్తున్నారన్నారు.  సీపీఎస్‌ రద్దు చేస్తామని, కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్‌ చే స్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగలతో పాటు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి సామాన్య ప్రజలకు భారంగా మారిన పెట్రో, డీజల్‌, కరెంటు, బస్సు ఛార్జీలు తగ్గించాలని కోరారు. ప్ర సాద్‌నాయుడు, ప్రతాప్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ మురళి, రెడ్డెప్ప, శేఖర్‌యాదవ్‌, రెడ్డెప్ప, హరికృష్ణ, వెంకట్ర మణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


శాంతిపురం: ఆర్టీసీ బస్‌ఛార్జీల పెంపుతో సామాన్య జనంపై వైసీపీ ప్రభుత్వం భారం మోపుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు మండిపడ్డారు. బస్‌చార్జీల పెం పునకు నిరసనగా శనివారం శాంతిపురంలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన ధర్నాలో ఆయన మా ట్లాడు తూ... ఎన్నికలకు ముందు ఆర్టీసీ బస్‌ చార్జీలను ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదన్న సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడు సార్లు పెంచారన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు గణనీ యంగా పెంచి ప్రజలపై మోయలేని భారం మోపు తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు విశ్వనాథ నాయుడు, ఉదయ్‌కుమార్‌, నాగరాజు, దాము, జ నార్దనరెడ్డి, ఆర్‌ఎస్‌మణి, గోవిందరాజులు, విజయ రామిరెడ్డి, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-03T05:48:59+05:30 IST