బస్సు చార్జీలు తగ్గించాలి

ABN , First Publish Date - 2022-07-03T05:58:34+05:30 IST

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో శనివారం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రా స్తారోకో చేపట్టారు.

బస్సు చార్జీలు తగ్గించాలి
ధర్మవరంలో రాస్తారోకో నిర్వహిస్తున్న టీడీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు

టీడీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన

ధర్మవరం, జూలై 2: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో శనివారం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రా స్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ, వామపక్ష నాయకులు మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో మూడుసార్లు ఆర్టీసీ బస్సు చార్జీలు, ఏడు సార్లు విద్యుత చార్జీలను పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపిందన్నారు. ఏ రాష్ట్రంలోని లేని విధంగా చెత్తపై పన్ను విదించారన్నారు. ధరలపై నియంత్రణ లేదన్నారు. బస్సు చార్జీలు పెంపుతో ప్రజలు బస్సు ఎక్కడానికి భయపడుతున్నారని విమర్శించారు. ఈ రాస్తా రోకోతో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోవడంతో అర్బన సీఐ సుబ్రహ్మణ్యం సిబ్బం దితో అక్కడికి వెళ్లి రాస్తారోకో విరమింపజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పురుషోత్తంగౌడ్‌, మేకల రామాంజనేయులు, సాకే కుళ్లాయప్ప, చిన్నూరు విజయ్‌ చౌదరి, గోసల శ్రీరాములు, సాహెబ్బీ, బీబీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు, నాయకులు జంగాలపల్లి పెద్దన్న, ఎస్‌హెచ బాషా, మారుతి, సన్నప్పయ్య, సీపీఐ నాయకులు వెంకటనారాయణ, వెంకటస్వామి, రమణ, రవి, హరి పాల్గొన్నారు.

కొత్తచెరువు: ఆర్టీసీ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం కొత్తచెరువులో టీడీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మాజీ మంత్రి పలె ్లరఘునాథరెడ్డి పిలుపు మేరకు టీడీపీ మండల నాయకులు మండలకేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలిలో మానవహా రంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు.  టీడీపీ మండల, పట్టణ కన్వీనర్లు రామక్రిష్ణ, ఒలిపి శ్రీనివాసులు, నాయకులు నాగేంద్రప్రసాద్‌; గాజుల చంద్ర, బోయరాజు, ఎరువుల నాయుడు, సైకిల్‌షాపు బాబా, కిరణ్‌, కిశోర్‌, సుబ్బరాయుడు, వడ్డేశంకర్‌, బోయశివ, డిపో భాస్కర్‌, సుధాకర్‌, గోరంట్లపల్లిశీన, సుబ్ర హ్మణ్యం, వెంకటేశ, రమేశబాబు తదితరులు పాల్గొన్నారు.

పుట్టపర్తి: పెంచిన బస్‌ చార్జీలు తగ్గించాలని శనివారం స్థానిక బస్‌డిపో ఎదు ట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి అంజనేయులు మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచి పేదప్రజల నడ్డివిరుస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పేరోజులు దగ్గరపడ్డాయన్నారు. సీపీఐ నాయకులు షేక్షావలి, చలపతి, వెంకటరమణ, రత్నాబాయి, ప్రసాద్‌, ఆదిలక్ష్మి, కృష్ణారెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే పెంచిన బస్‌చార్జీలను వెంటనే  ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండుచేశారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ  బస్‌డిపో ఎదుట శనివారం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేసు, వ్యవసాయ కార్మికసంఘం అధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు బ్యాళ్ల అంజి, గౌస్‌లాజం, గంగాధర్‌,  నాగార్జున, నరసింహులు, నాగరాజు, చంద్రశేఖర్‌ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. పన్నులు వేయడంలో జగన ఔరంగజేబును మించిపోయాడని మండిపడ్డారు.

నేటి ధర్నాను జయప్రదం చేయండి 

తనకలు: పెంచిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల కన్వీనర్‌ రెడ్డి శేఖర్‌రెడ్డి, తెలుగుయువత ఆధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ కోరారు. మండలంలోని తెలుగుదేశం పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు. 


Updated Date - 2022-07-03T05:58:34+05:30 IST