Nainital: విరిగిపడిన కొండచరియలు...

ABN , First Publish Date - 2021-08-21T19:05:53+05:30 IST

భారీవర్షాల వల్ల ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో బస్సులో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్న ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ సమీపంలో జరిగింది.....

Nainital: విరిగిపడిన కొండచరియలు...

తృటిలో తప్పించుకున్న బస్సు ప్రయాణికులు

నైనిటాల్(ఉత్తరాఖండ్): భారీవర్షాల వల్ల ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో బస్సులో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్న ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ సమీపంలో జరిగింది. ఉత్తరాఖండ్ లో ప్రయాణికులతో కూడిన బస్సు నైనిటాల్ ఘాట్ రోడ్డులో వస్తుండగా వర్షాల వల్ల కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో బస్సు డ్రైవరు సమయస్ఫూర్తితో కొండచరియలు విరిగిపడుతున్న స్థలానికి ముందే బస్సు ఆపారు. దీంతో బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో బస్సులో నుంచి దూకి వెనక్కు పరుగెత్తారు. అంతలో బస్సు డ్రైవరు బస్సును రివర్స్ లో వెనక్కి తీసుకువెళ్లాడు. కొండచరియలు, చెట్లు విరిగిపడటంతో నైనిటాల్ రోడ్డు మూసుకుపోయింది. 


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెండురోజుల పాటు భారీవర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం అప్రమత్తమైంది. అతి భారీవర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్ లో జూన్ నెలలో 811 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.గత నెలలో హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్‌లో పలు కొండచరియలు విరిగిపడిన సమయంలో టెంపో ట్రావెలర్‌పై భారీ బండరాళ్లు పడ్డాయి. దీంతో తొమ్మిది మంది పర్యాటకులు మరణించారు. ఒక స్థానిక నివాసి సహా మరో ముగ్గురు గాయపడ్డారు.


Updated Date - 2021-08-21T19:05:53+05:30 IST