నీతి నిజాయితీలతో.. జగన్‌ పాలన

ABN , First Publish Date - 2022-05-29T06:48:11+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమై విశాఖ జిల్లా మీదుగా వైసీపీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర శనివారం ఏలూరు జిల్లాలో ప్రవేశిం చింది.

నీతి నిజాయితీలతో..  జగన్‌ పాలన
కైకరం సభలో మాట్లాడుతున్న హోం మంత్రి తానేటి వనిత

సామాజిక భేరి సదస్సుల్లో మంత్రుల స్పష్టీకరణ

కైకరం, ఏలూరుల్లో సభలు 

ఉపాధి కూలీలను ఆటోల్లో తరలించిన అధికారులు

మండుటెండలలో జనం పాట్లు

ఏలూరు రూరల్‌/ఉంగుటూరు, మే 28 : శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమై విశాఖ జిల్లా మీదుగా వైసీపీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర శనివారం ఏలూరు జిల్లాలో ప్రవేశిం చింది. ఉంగుటూరు మండలం కైకరం శివారు జరిగిన బహిరంగ సభ కేవలం పది నిమిషాలలోనే ముగిం చారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఉపన్యాసంతో మొద లైన సభలో 17 మంది మంత్రులున్నా తానేటి వనిత, కారు మూరి నాగేశ్వరరావు మాత్రమే ప్రసంగించారు. మంత్రి వనిత మాట్లాడుతూ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు, జ్యోతీ రావు పూలే ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో జగన్‌ పాలన నడుస్తోందన్నారు. మంత్రి కారుమూరి మాట్లా డుతూ జగన్మోహనరెడ్డి చిన్న వయసులోనే సీఎం అయినా కులం, మతం, ప్రాంతం చూడకుండా ఓటేసిన అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు. అనంతరం బైక్‌ ర్యాలీగా బయలుదేరిన బృందం ఏలూరు ఆశ్రం ఆసుపత్రి ఎదురుగా వున్న ఆటో నగర్‌లో సభలో పాల్గొంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా సీఎం జగన్‌ బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారన్నారు. టీడీపీ తలపెట్టి మహానాడు సభ, వెన్నుపోటు సభ, అభివృద్ధి నిరో ధక సభలా ఉందని ఎద్దేవా చేశారు. మరో మంత్రి ఉషశ్రీ చరణ్‌ మాట్లాడుతూ నీతి నిజాయితీతో జగన్‌ పరిపాలన సాగిస్తున్నారన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ము త్యాల నాయుడు, మేరుగు నాగార్జున, తానేటి వనిత, వేణు గోపాలరావు, సురేష్‌, ఎంపీ డాక్టర్‌ సత్యవతి, జోగి రమేష్‌, ఏలూరు మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, కో ఆప్షన్‌ సభ్యులు పెదబాబు, వైసీపీ నగర అధ్యక్షులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మహిళల పాట్లు

మంత్రులకు స్వాగతం పలికేందుకు మహిళలు, యువకులు, కార్యకర్తలు, దెందులూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చారు. సభకు జనాన్ని తరలించడానికి వలంటీర్లు, సచివాలయ సిబ్బంది విశేషంగా కష్టపడ్డారు. పథకాలు అందుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కుటుంబాలు తరలి రావాలని సమాచారం ఇచ్చారు. వారిని సభకు తరలించడంలో ఉద్యోగులే తమపై భారం పెట్టుకోవ డంతో పలు గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. ఉపాధి కూలీలు తరలి రావాలని, వస్తేనే మస్తర్లు వేస్తామని చెప్పి డ్వాక్రా సీఏలు పెద్ద ఎత్తున కైకరం సభకు తరలించారు. ఈ మేరకు వారికి ఆటోలు ఏర్పాటు చేశారు. మంత్రులు వచ్చే సమయానికి ఎండ ఎక్కువగా ఉండడంతో రోడ్డు సమీపంలోని చెట్ల నీడన మహిళలు సేద తీరుతున్నా రు. దీంతో వీరందరినీ వేదిక ముందున్న కుర్చీలలో కూర్చో బెట్టేందుకు నాయకులు, డ్వాక్రా సీఏలు తంటాలుపడ్డారు. 

Updated Date - 2022-05-29T06:48:11+05:30 IST