ఇక వెళ్లొస్తాం !

ABN , First Publish Date - 2022-01-18T06:04:06+05:30 IST

సంక్రాంతి పండుగ ముగిసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి బయలుదేరడంతో సోమవారం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడాయి.

ఇక వెళ్లొస్తాం !
నరసాపురం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు

ముగిసిన సంక్రాంతి పండుగలు

 తిరుగుముఖం పట్టిన బంధువులు

 కిటకిటలాడిన రైల్వేస్టేషన్‌, బస్టాండ్లు

 నరసాపురం టు హైదరాబాద్‌తోపాటు

 కాకినాడ, విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు 

నరసాపురం, జనవరి 17 : సంక్రాంతి పండుగ ముగిసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి బయలుదేరడంతో సోమవారం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడాయి. ఉదయం నుంచి ఇదే రద్దీ కనిపించింది. స్పెషల్‌ రైళ్లన్నీ సాయంత్రం బయలు దేరాయి. వాటిల్లోని జనరల్‌ బోగీలన్నీ నిండుకున్నాయి. ఆదివారంతో పండుగ ముగిసినా.. చాలామందికి టిక్కె ట్లు దొరక్కపోవడం, మరికొందరికి మొక్కులు తీరకపో వడంతో తిరుగుప్రయాణాన్ని సోమవారానికి వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్‌ వెళ్లే సర్వీసుల్లోనే ఎక్కువ రద్దీ కనిపించింది. జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఆర్టీసీ సోమవారం 41 ప్రత్యేక బస్సులను నడి పింది. నరసాపురం నాలుగు, భీమవరం ఐదు, తాడేప ల్లిగూడెం ఆరు, తణుకు ఎనిమిది, ఏలూరు తొమ్మిది, జంగారెడ్డిగూడెం ఐదు, కొవ్వూరు, నిడదవోలు రెండేసి చొప్పున సర్వీసులు నడిచాయి. ఇక జిల్లా మీదుగా ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడిచాయి. వీటిలో నరసాపురం నుంచి మూడు, కాకినాడ నుంచి రెండు, విశాఖ నుంచి మూడు రైళ్లు ఉన్నాయి. ఇవన్ని అవి బయలుదేరిన చోటే నిండిపోయాయి. జనరల్‌ బోగీలన్నీ హౌస్‌పుల్‌. ఇక టిక్కెట్లు దొరకని ప్రయాణికులు ప్రైవేట్‌ బస్సుల ను ఆశ్రయించారు. ఆర్టీసీ స్పెషల్‌ బస్సుకు 30 శాతం ఛార్జీని వసూలు చేస్తే.. ప్రైవేట్‌ ఆపరేటర్లు డిమాం డ్‌ను బట్టి దోచుకున్నారు. టిక్కెట్‌ రూ.1,500 నుంచి రూ.2 వేలకు విక్రయించారు. కలపర్రు టోల్‌గేటు వద్ద మార్గం రద్దీగా మారింది. పెద్ద ఎత్తున కార్లు బారులు తీరాయి. చాలా మందికి రైళ్లు, బస్సుల టిక్కెట్లు దొరక్క పోవడంతో కార్లను ఆశ్రయించారు. 

Updated Date - 2022-01-18T06:04:06+05:30 IST