ఎన్నికల నేపథ్యంలో Gujarat బస్సులకు కాషాయ రంగు

ABN , First Publish Date - 2022-06-16T17:00:58+05:30 IST

గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు కాషాయం రంగు పూయడం...

ఎన్నికల నేపథ్యంలో Gujarat బస్సులకు కాషాయ రంగు

అహ్మదాబాద్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు కాషాయం రంగు పూయడం వివాదానికి దారితీసింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున బస్సులన్నింటికీ కాషాయం రంగు వేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. దీంతో బీజేపీ హిందుత్వ కార్డును వాడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.బస్సులకు కాషాయ రంగు వేస్తున్న చర్యపై కాంగ్రెస్ స్పందిస్తూ, ఇది హిందుత్వాన్ని రుద్దే ఎత్తుగడ అని ఆరోపించింది.


 ‘‘బీజేపీ బస్సులకు కాషాయ రంగు వేసి హిందూత్వ కార్డును ఎన్నికల్లో వాడటానికి ప్రయత్నిస్తోంది, మొదట బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రవాణా కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వాలి, గుజరాత్ గ్రామాల్లో బస్సు కనెక్టివిటీ పెంచాలి.బస్సుల రంగు మార్చే బదులు ముందుగా గుజరాత్ ప్రజలకు మంచి సేవలు అందించాలి’’ అని కాంగ్రెస్ నాయకుడు హేమంగ్ రావల్ డిమాండ్ చేశారు.కాగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్న 200 బస్సులు, 300 స్లీపర్ బస్సులు, 500 డీలక్స్ బస్సులకు కాషాయ రంగు వేస్తున్నామని, ఈ రంగులు వేయడం రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారి కే డీ దేశాయ్ చెప్పారు.ప్రధాని మోదీ కార్యక్రమాలకు జనాన్ని తరలించేందుకు గుజరాత్ బస్సులను ఉపయోగిస్తున్నారని, దీనివల్ల రోడ్డు రవాణ సంస్థకు తీరని నష్టం వస్తుందని కాంగ్రెస్ నేత మనీష్ దోషి ఆరోపించారు. 


Updated Date - 2022-06-16T17:00:58+05:30 IST