వ్యాపారం పెనుభారం

ABN , First Publish Date - 2021-05-10T04:43:04+05:30 IST

ప్రస్తుతం వ్యాపారం పెనుభారమైంది. ఎటుచూసినా వ్యాపారం జరగక దుకాణ దారులు లక్షల పెట్టుబడికి వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడక తప్పడంలేదు.

వ్యాపారం పెనుభారం
జనసంచారంలేక వెలవెల బోతున్న మైదుకూరు వస్త్ర కాంప్లెక్స్‌

కళ తప్పిన వస్త్రం

వన్నెతగ్గిన పసిడి

లక్షల్లో పెట్టుబడి

బాడుగలు భారం

  శుభ ముహూర్తాలు మొదలు, రంజాన్‌ మాసం కావడంతో దుస్తుల కొనుగోలు ఎక్కువగా జరుగుతాయి. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దుకాణాలు కళావిహీనమై కనిపిస్తున్నాయి.  పండుగలు, పెళ్లిళ్ల కోసం వ్యాపారులు లక్షల పెట్టుబడితో కొత్తస్టాక్‌ తెప్పించి ఉంచారు. వైరస్‌ విజృంభణతో జిల్లాలో నిత్యం వెయ్యికి  పైగా కేసులు నమోదవుతుండడంతో కర్ఫ్యూ విధించారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకంతా దుకాణాలు కట్టేయాల్సి వస్తోంది. ఉదయం పదిగంటలకు వస్త్ర దుకాణాలు తెరవడం, 11 గంటల తర్వాత బంగారు ధరను ప్రకటిస్తుండడంతో ఆ వ్యాపారం కూడా 11 తర్వాత మొదలవుతుంది. అంటే దుకాణం తెరిచిన గంట, రెండుగంటల్లోపే దుకాణాలు మూసేయాల్సి వస్తోంది. దీంతో పెళ్లిళ్ల సీజన్‌ అయినా వస్త్ర, బంగారు దుకాణాలు వెలవెలబోతున్నాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకెళితే....

మైదుకూరు /బద్వేలు రూరల్‌ మే 9: 

 ప్రస్తుతం వ్యాపారం పెనుభారమైంది. ఎటుచూసినా వ్యాపారం జరగక దుకాణ దారులు లక్షల పెట్టుబడికి వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడక తప్పడంలేదు. కొంద రు కనీసం బాడుగలను సైతం చెల్లించ లేని స్థితికి చేరుకుంటున్నారు. గత పెళ్లి ల్ల సీజన్‌ మొత్తం కొవిడ్‌ మొదటి దశ నాశనం చేసింది. రాబోయేది పెళ్లిల్ల సీజ న్‌ అని, రంజాన్‌ మాసం కూడా సజావు గా జరుగుతుందని భావించిన   వ్యాపా రులు గత వ్యాపారాన్ని ఈ ఏడాదైనా చేజిక్కించుకోవచ్చని కొత్త కొత్త రకాల వసా్త్రలను తెప్పించి పెట్టుకున్నారు.

ఇం తలో రెండో దశ అంటూ వందల ప్రా ణాలను పొట్టనబెట్టుకుంటూ పరెగెడు తోంది. కొవిడ్‌ కేసుల నమోదు పెరుగు దలతో కరోనా ధాటి నుంచి తప్పించుకు నేందుకు కర్ఫ్యూ పేరుతో మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపారం చేయాలని అధికారులు నిబంధనలు పెట్టారు. దీంతో వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

ముఖ్యంగా వస్త్ర, బంగారు ఆభరణాల వ్యాపారం కుదేలైంది. గతం లో నిత్యం కోట్లాది రూపాయల అమ్మకా లు జరిగితే ప్రస్తుతం 10 శాతం జరగా లన్నా గగనమైంది. వైరస్‌ కట్టడికి వ్యా పారాల వైపు నుంచి జాగ్రత్తలు తీసుకు న్నా వినియోగదారులు మాత్రం కొనుగో ళ్లకు ఆసక్తి చూపడంలేదు. ఒకే నెలలో రంజాన్‌, హిందువులు వివాహాలు చేసు కునేందుకు అనువైన శుభముహూర్తాలు ఉన్న తరుణంలో దుకాణాలు బంద్‌ చేయడం దారుణంగా ఉందని వ్యాపారు లు వాపోతున్నారు.

ముఖ్యంగా వస్త్ర, బంగారు వ్యాపారం మెండుగా జరిగే కడప నగరం, ప్రొద్దుటూరు, రాయచోటి ల్లోనే సగానికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న పరిస్థితి. ముస్లింలు ఎక్కువ జనాభా కలిగిన కడప నగరం, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, పులివెందుల, రాయచోటిల్లో ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్‌ పండుగకు పెద్దగా షాపింగ్‌ చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. గతంలో వస్త్ర దుకాణాల వద్ద ఉండే సందడి ఇప్పుడు కనిపించడంలేదు. తెప్పించిన సరుకు అమ్మకాలు జరగకుంటే ఆర్థికం గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంద ని వ్యాపారులు వాపోతున్నారు.

బాడుగలు భారం : యజమానులు

 గతేడాది మార్చిలో కరోనా మొదటి దశ ప్రారంభం కావడం, లాక్‌డౌన ప్రకటించ డంతో దాదాపు ఆరునెలల పైబడి వ్యా పార వర్గాలన్నీ దెబ్బతిన్నాయి. లాక్‌డౌన అనంతరం కూడా దుకాణాలు తెరిచినా అంతంత మాత్రమే వ్యాపారాలు జరిగా యి. ఈ ఏడాది వ్యాపారాలు పెరుగుతు న్న దశలో రెండోదశ కరోనాతో వ్యాపార వర్గాలను కలవరపెడుతున్నాయి.

గదుల బాడుగలు కూడా కట్టలేని పరిస్థితికి చేరుకుంటున్నామని, ఇక కుటుంబాల పోషణ ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. బద్వేలు సిద్దవటం రోడ్డులో దాదాపు 50 పైబడి స్వర్ణ (బంగారు) దుకాణాలు, 70కి పైగా వస్త్ర, రెడీమేడ్‌ షాపులు ఉ న్నాయి. సీజన వచ్చినా కొనుగోలు అం తంత మాత్రంగానే సాగుతోంది.

ఇలాం టి సమయంలో మధ్యాహ్నం 12 గంటల కే వ్యాపారాలు బంద్‌ చేయాలని అధికా రులు నిబంధనలు విధించడంతో దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్త్ర, రెడిమేడ్‌ షాపులకు చుట్టుపక్కల గ్రామీణులు సైతం వచ్చేవారు. ప్రస్తు తం వాహనాలు సైతం బంద్‌ చేయడం తో రవాణాజరగక పోవడంతో వ్యాపారా లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

లక్షల్లో పెట్టుబడులు పెట్టాం 

గతేడాది కరోనా లాక్‌ డౌన్‌ సమయంలోనూ  ఇబ్బందు లు పడ్డాం. ఈసారి అలాంటి పరిస్థితే రాదనుకుని శుభకార్యక్రమాలు, రంజాన్‌ కావడంతో లక్షల్లో పెట్టు బడులు పెట్టి వస్త్రాలు తెప్పిచ్చాం. సరిగ్గా ఇప్పుడే కర్ఫ్యూ విధిస్తున్నారు. ప్రజా సంక్షే మం కోసం ప్రభుత్వం చేయడం మంచిదే. అయితే వ్యాపారులను కూడా ఒక కంట గమనించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.  

సత్యనారాయణ, వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు, మైదుకూరు 


అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి

గతేడాది కరోనా ప్రారంభంనుంచీ నేటి వరకు కూడా బంగారు అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. వివాహా ది శుభకార్యాలు జరుగుతున్న సీజన్లో కూడా బంగారు అమ్మకాలు పెద్దగా లేకపోవడం ఎప్పుడూ చూడలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కొనుగోలుదారులు బంగా రుపై ఆసక్తి చూపడంలేదు. నిర్ణీత సమయం కారణం గా దుకాణాల్లో దుమ్ముదులుపుకొని ఇంటికి వెళుతున్నాం. 

 - ఎస్‌.జహంగీర్‌బాషా, బంగారం దుకాణ యజమాని, బద్వేలు





Updated Date - 2021-05-10T04:43:04+05:30 IST