ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం.. భారత వ్యాపారవేత్తల్లో పెరుగుతున్న ఆసక్తి..

ABN , First Publish Date - 2022-04-11T01:21:04+05:30 IST

: ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఇటీవల కుదిరిన ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు, అక్కడ తమ వ్యాపారాలన్ని విస్తరించేందుకు అనేక మంది భారతీయ వ్యాపారవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.

ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం.. భారత వ్యాపారవేత్తల్లో పెరుగుతున్న ఆసక్తి..

ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఇటీవల కుదిరిన ఆర్థిక సహకార, వాణిజ్య  ఒప్పందం నేపథ్యంలో ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు, అక్కడ తమ వ్యాపారాలన్ని విస్తరించేందుకు అనేక మంది భారతీయ వ్యాపారవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.  ఆస్ట్రేలియాలో వ్యాపారం రీత్యా శాశ్వత నివాసం కోరుతున్న వారికి ఎన్నో సౌలభ్యాలు ఉంటాయని వీసా కన్సల్టెంట్ ఒకరు వ్యాఖ్యానించారు. కుటుంబంతో సహా అక్కడికి తరలి వెళ్లడమే కాకుండా వారందరూ ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆస్ట్రేలియాకు వెళ్లిన మూడేళ్ల తరువాత పర్మెనెంట్ రెసిడెన్సీ అర్హత లభిస్తుంది. ఆ తరువాత..వ్యాపార వేత్తల కుటుంబంలోని విద్యార్థులు ఫీ-హెల్ప్ పథకం కింద స్కాలర్‌షిప్‌లు కూడా పొందవచ్చు. మెడికెయిర్ ప్రోగ్రామ్‌లోనూ భాగస్వాములు కావచ్చు. 


ఈ బిజినెస్ వీసా(188-ఏ)కు 55 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఉండటంతో వ్యాపారవేత్తలకు ఇది ఎంతో అనువైనదని చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలు ఈ వీసాలను స్పాన్సర్ చేస్తుంటాయి. సైన్స్, టెక్నాలజీ, మాథ్య్స్, మెడిసిన్ రంగాల్లోని వారికి విక్టోరియా రాష్ట్రం ఈ వీసాలను ఇస్తుంటుంది. ఫుడ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనాలు, వ్యవసాయంలో ఉన్న పారిశ్రామిక వేత్తలకు న్యూసౌత్ వేల్స్ ఆహ్వానం పలుకుతోంది. అయితే.. కొన్ని రాష్ట్రాలు వార్షిక టర్నోవర్‌కు సంబంధించిన మార్గదర్శకాలు కూడా విధిస్తాయి. అయితే.. కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టేవారికి కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్ వీసా ఆఫర్ చేస్తోంది. ఈ వీసా పొందేందుకు  ఇంగ్లీష్ తప్పనిసరిగా వచ్చి ఉండాలన్న నిబంధన కూడా లేదు. 

Updated Date - 2022-04-11T01:21:04+05:30 IST