పిఎమ్-వాణి బిజినెస్ ప్రమోషన్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-03T21:54:25+05:30 IST

సికింద్రాబాద్ లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్ కార్యలయం లో ఏర్పాటు చేసిన పబ్లిక్‌ వైఫై యాక్సెస్‌ నెట్‌ వర్క్‌ ఇంటర్‌ ఫేజ్‌ (పిఎమ్ వాణీ) - బిజినెస్స్ ప్రమోషన్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల టెలికం సలహాదారు అశోక్ కుమార్ ఈ రోజు ప్రారంభించారు.

పిఎమ్-వాణి బిజినెస్ ప్రమోషన్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్ కార్యలయం లో ఏర్పాటు చేసిన పబ్లిక్‌ వైఫై యాక్సెస్‌ నెట్‌ వర్క్‌ ఇంటర్‌ ఫేజ్‌ (పిఎమ్ వాణీ) - బిజినెస్స్ ప్రమోషన్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల టెలికం సలహాదారు అశోక్ కుమార్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో లక్షలాది వైఫై హాట్‌ స్పాట్‌ లను సృష్టించేందుకు ‘పిఎమ్ వాణి’ ప్రాజెక్టు వీలు కల్పిస్తుందని, గ్రామీణ ప్రజలకు బ్రాడ్‌ బ్యాండ్‌ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు పి‌ఎమ్ వాణి  ఉపకరిస్తుందని  తెలిపారు. పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ (పీడీఓ)లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మొబైల్‌ డేటాతో పని లేకుండానే ప్రజలకు ఇంటర్ నెట్‌ అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. 


అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (టెక్నాలజీ) కె. రాజశేఖర్ మాట్లాడుతూ, ‘పిఎం–వాణి’గా వ్యవహరించే ఈ పబ్లిక్‌ వైఫై యాక్సెస్‌ నెట్‌ వర్క్‌ ఇంటర్‌ ఫేజ్‌ లో భాగంగా  పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ (పీడీఓ), పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ అగ్రిగేటర్లు (పీడీఓఏ) వివిధ వర్గాల భాగస్వామ్యంతో ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్ కృషి చేస్తుందని తెలిపారు.‘పిఎమ్-వాణి’ ప్రాజెక్టు లో భాగంగా పీడీఓలను ఇప్పుడు ఎవరైనా ఏర్పాటుచేసుకోవడం సులభతరమన్నారు.  ఈ వైఫై సెటప్ బాక్స్ లను  రూ. 3,000 – రూ. 12,000 లకు కొనుగోలు చేయవచ్చని శ్రీ కె. రాజశేఖర్ తెలిపారు. వ్యాపారాభివృద్ధి కోసం చిల్లర వర్తకులు, చిరు వ్యాపారస్తులు, ఇంకా నిరుద్యోగులు ఈ పీడీఓలను ఏర్పాటు చేసుకొని ఉపాధి అవకాశాలను మెరుగు పరచుకోవచ్చని ఆయన తెలిపారు. 

 

డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీ జె. రాజారెడ్డి మాట్లాడుతూ, లైసెన్స్‌ రహిత సంస్థలు అట్టడుగు స్థాయిలో వైఫై సేవలను అందించేందుకు పిఎమ్-వాణి వీలుకల్పిస్తుందని, ఈ విధంగా మొబైల్‌ డేటాతో పని లేకుండానే గ్రామీణ ప్రజలకు ఇంటర్ నెట్ అందుబాటులో ఉంటుందని అన్నారు.యూజర్లు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం కోసం ‘పిఎమ్-వాణి’ యాప్ లో తమ వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది.  పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ (పీడీఓ) లు ఏర్పాటు చేసుకొనేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.  మరిన్ని వివరాలకు సికింద్రాబాద్ లోని డి‌ఓటిం కార్యాలయం 040-27897743 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.

Updated Date - 2022-03-03T21:54:25+05:30 IST