
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ప్రజాపాలన కాదని బిజినెస్ (Business) పాలన జరుగుతోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ దాడుల్లో పార్థసారథి ఆఫీసులో రూ.500 కోట్లు దొరికాయని ఆరోపించారు. పార్థసారథికి సీఎం కేసీఆర్ రాజ్యసభ ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇక్కడి రైతులు చస్తే దిక్కులేదు.. హర్యానా రైతులకు సాయమా అని నిలదీశారు. ప్రధాని మోదీ, కేసీఆర్ అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీలో ఆ పార్టీ నేత బండి సంజయ్ మాటకు విలువ లేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్ను జైల్లో పెడతామని సంజయ్ మొరుగుతున్నా.. జాతీయ నేతలు పట్టించుకోవడం లేదని జగ్గారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి