ten years కష్టం ఫలించిందంటూ యువకుడి మెసేజ్.. మమ్మల్ని ఆశీర్వదించావ్.. అంటూ బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా.. విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-05T00:23:45+05:30 IST

ప్రతి మధ్య తరగతి కుటుంబంలో (Middle class families) చాలా మందికి కారు కొనాలనే కోరిక ఉంటుంది. కానీ ఆర్థికంగా అది సాధ్యపడదు. కారు కొనాలనే కోరికతో ఎన్నో ఏళ్ల నుంచి డబ్బులు..

ten years కష్టం ఫలించిందంటూ యువకుడి మెసేజ్.. మమ్మల్ని ఆశీర్వదించావ్.. అంటూ బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా.. విషయం ఏంటంటే..

ప్రతి మధ్య తరగతి కుటుంబంలో (Middle class families) చాలా మందికి కారు కొనాలనే కోరిక ఉంటుంది. కానీ ఆర్థికంగా అది సాధ్యపడదు. కారు కొనాలనే కోరికతో ఎన్నో ఏళ్ల నుంచి డబ్బులు సేవ్ వచ్చినా.. మధ్య మధ్యలో తలెత్తే సమస్య వల్ల సేవింగ్స్‌ను ఖర్చు చేయాల్సి వస్తుంటుంది. ప్రతి ఒక్క మిడిల్‌ క్లాస్‌ కుటుంబంలో ఇలాంటి ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. అందుకే చాలా మంది తమ కోరికలు చంపుకొని.. కష్టమైనా టూ వీలర్‌ మీదే ముగ్గురు, ఒక్కోసారి నలుగురు కూడా ప్రయాణిస్తుంటారు.. అయితే ఓ వ్యక్తి మాత్రం తన కలను సాకారం చేసుకున్నాడు. దాదాపు దశాబ్దం పాటు డబ్బులను సేవింగ్ చేస్తూ.. చివరికి తన డ్రీమ్‌ కారును కొనుగోలు చేశాడు. చివరకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) అభినందనలను అందుకున్నాడు.


తమిళనాడులోని (Tamil Nadu) కావేరిపట్టణంలోని కృష్ణగిరికి చెందిన అశోక్‌ కుమార్‌ అనే వ్యక్తి ఒక రైతు. ఓ వైపు వ్యవసాయ పనులను చేస్తూనే.. ఫోన్‌ షోరూమ్‌ నడుపుతున్నాడు. తనకు ఎప్పటికైనా కారు కొనాలనే కోరిక ఉండేది. దీంతో రోజూ కొంత డబ్బును సేవ్‌ చేసుకుంటూ వచ్చాడు. అలా పదేళ్లు కష్టపడి మహీంద్రాకు చెందిన న్యూ మోడల్.. మహీంద్ర XUV 700 కారును కొనుగోలు చేశాడు. ఈ ఆనందాన్ని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రాతో షేర్‌ చేసుకున్నాడు. ‘‘సార్‌.. పదేళ్లు ఎంతో కష్టపడి సేవ్‌ చేసుకున్న డబ్బులతో కొత్తకారు కొన్నాను. మీ ఆశీర్వాదం కావాలి’’ అంటూ ట్వీట్ చేశాడు అశోక్‌ కుమార్.

Bank Cash: బ్యాంక్‌కు వెళ్లిన 12ఏళ్ల బాలుడు.. రూ.35లక్షల బ్యాగుతో తిరిగొచ్చాడు.. చివరకు అధికారులు ఆరాతీయగా..


ఈ ట్వీట్‌పై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ‘‘థ్యాంక్యూ.. నిజానికి మా కంపెనీ కారు ఎంచుకుని.. మమ్మల్ని ఆశీర్వదించింది మీరే. కష్టపడి సాధించిన మీ విజయానికి అభినందనలు.. హ్యాప్పీ మోటరింగ్’’.. అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో అశోక్‌ కుమార్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై.. ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలియజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు సైతం అశోక్‌ కుమార్‌‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Instagram friendship: ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన పైలట్.. ఏకంగా 30మంది మహిళలతో.. చివరకు తెలిసింది ఏంటంటే..





Updated Date - 2022-08-05T00:23:45+05:30 IST