ఉరితాడుకు కొడుకు మృతదేహం.. తట్టుకోలేని తండ్రి.. కట్టర్ తీసుకుని పరుగుపరుగున కోడలి గదిలోకి వెళ్లాడు.. తరువాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-12T17:09:54+05:30 IST

కుమారుని ఆత్మహత్యతో మానసికంగా కుంగిపోయిన ఆ తండ్రి..

ఉరితాడుకు కొడుకు మృతదేహం.. తట్టుకోలేని తండ్రి.. కట్టర్ తీసుకుని పరుగుపరుగున కోడలి గదిలోకి వెళ్లాడు.. తరువాత ఏం జరిగిందంటే..

కుమారుని ఆత్మహత్యతో మానసికంగా కుంగిపోయిన ఆ తండ్రి.. కోడలిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యూపీలోని మీరఠ్‌లో వ్యాపారి అమిత్ బన్సల్(31) ఆత్మహత్య అనంతరం.. నోయిడాలోని జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమిత్ భార్య పింకీ కూడా ప్రాణాలొదిలింది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. అమిత్ బన్సల్ తన భార్యతో వివాదం జరిగిన నేపధ్యంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసుల అమిత్ ఇంటికి చేరుకున్నారు. 


ఇంటిలోని ఒక గదిలో రక్తసిక్తమైన స్థితిలో అమిత్ భార్య పడివుండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అమిత్ కుటుంబ సభ్యులు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల మందు దాచిపెట్టేందుకు ప్రయత్నించారు. కోడలు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకు అమిత్ తండ్రిపై అనుమానం కలిగింది. దీంతో పోలీసులు అతనిని ప్రశ్నించారు. అతనే పింకీపై దాడికి పాల్పడ్డాడని తేలడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. నౌచందీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీనగర్‌కు చెందిన అమిత్ బన్సల్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తుంటాడు. అతని తండ్రి రామ్‌కిషన్ సీలియర్ లాయర్. అమిత్‌కు మూడేళ్ల క్రితం పింకీ(28)తో వివాహమయ్యింది.


వీరికి ఏడాదిన్నర వయసుగల కుమార్తె ఉంది. కొంతకాలం క్రితం అమిత్ తన భార్యా పిల్లలతో పాటు విదేశాలు వెళ్లి వచ్చాడు. ఇటీవల ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపధ్యంలో కలత చెందిన అమిత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ ఏకైక కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో కలత చెందిన రామ్‌కిషన్.. కోడలు పింకీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కట్టర్‌తో ఆమెపై దాడి చేశాడు. ఇంతలో పోలీసులు రంగం ప్రవేశం చేసి, బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-12T17:09:54+05:30 IST