తల్లి బ్యాంక్ అకౌంట్లోంచి రూ.5 లక్షలు మాయం.. 17 ఏళ్ల కొడుకు చేతికి ఫోన్ ఇస్తే జరిగింది ఇదీ..!

ABN , First Publish Date - 2022-06-28T21:58:27+05:30 IST

ఆ కుర్రాడి వయసు 17 సంవత్సరాలు.. ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు.. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డాడు..

తల్లి బ్యాంక్ అకౌంట్లోంచి రూ.5 లక్షలు మాయం.. 17 ఏళ్ల కొడుకు చేతికి ఫోన్ ఇస్తే జరిగింది ఇదీ..!

ఆ కుర్రాడి వయసు 17 సంవత్సరాలు.. ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు.. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డాడు.. అదుపులోకి తీసుకుని విషయం తెలుసుకున్న పోలీసులు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.. విచారణలో తనను ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి గుజరాత్‌లోని బరూచ్‌ నుంచి తీసుకొచ్చాడని చెప్పాడు.. ఆ కుర్రాడు చెబుతున్నది నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు.. దీంతో ఆ కుర్రాడు అసలు విషయం బయటపెట్టాడు.. హ్యాకర్ల బారిన పడిన తను ఇంటి నుంచి పారిపోయి వచ్చానని తెలిపాడు. 


ఇది కూడా చదవండి..

ప్రియుడితో ఇంట్లోనే దొరికిపోవడంతో భర్తకు ఆగ్రహం.. కొద్ది నిమిషాల్లోనే భార్య తీసుకున్న నిర్ణయంతో అతడికి మైండ్‌బ్లాంక్..!


గుజరాత్‌లోని బరూచ్‌‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కొడుకు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. తరచుగా తన తల్లి స్మార్ట్‌ఫోన్లో గేమ్స్ ఆడుతుండే ఆ కుర్రాడికి డార్క్ వెబ్, డీప్ వెబ్ హ్యాకర్లతో పరిచయం ఏర్పడింది. వారు ఆ కుర్రాడి ఫోన్‌ను హ్యాక్ చేశారు. ఆ కుర్రాడి తల్లి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.4.80 లక్షలు మాయం చేశారు. విషయం తెలుసుకున్న కుర్రాడు తల్లిదండ్రులు తిడతారేమోననే భయంతో ఇంటి నుంచి పారిపోయాడు. అకౌంట్లో నుంచి డబ్బులు మాయమైపోవడం, కొడుకు ఇంటి నుంచి పారిపోవడంతో ఆ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. 


రెండు ఘటనల గురించి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కుర్రాడు గుజరాత్ నుంచి ఏకంగా రాజస్థాన్‌లోని అజ్మీర్ వెళ్లిపోయాడు. అక్కడి పోలీసులకు కిడ్నాప్ కథ చెప్పాడు. చివరకు నిజం అంగీకరించాడు. అజ్మీర్ పోలీసులు ఆ కుర్రాణ్ని బరూచ్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


Updated Date - 2022-06-28T21:58:27+05:30 IST