ముమ్మరంగా పంటల సాగు

ABN , First Publish Date - 2022-06-28T04:58:01+05:30 IST

ఆశల సాగు మొదలైంది. మట్టిని నమ్మి దుక్కులు దున్ని ముమ్మరంగా రైతన్నలు విత్తనాలు విత్తుతున్నారు.

ముమ్మరంగా పంటల సాగు
్ఠ వేపూరికోట సమీపంలో వేరుశనగ విత్తనాలు విత్తుతున్న రైతులు

ములకలచెరువు, జూన్‌ 27: ఆశల సాగు మొదలైంది. మట్టిని నమ్మి దుక్కులు దున్ని ముమ్మరంగా రైతన్నలు విత్తనాలు విత్తుతున్నారు. మం డలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రస్తుతం భూమిలో తేమశాతం బాగా ఉండడంతో రైతులు ముందడుగు వేసి వేరుశనగ పంట సాగు చేస్తున్నారు. ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యం, వేపూరికోట, బురకాయలకోట, దేవళచెరువు తదితర గ్రామా ల్లో వేరుశనగ పంట సాగు ప్రారంభించారు. అతివృష్టితోనో...అనావృష్టితో నో ప్రతి ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగపంట సాగు చేస్తూ పెట్టుబడులు సైతం రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాతావరణం అనుకూ లించి ఒక వేళ పంట పండినా ఽగిట్టుబాటు ధర ఉండడం లేదు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు వేరుశనగ పంట చేతికందక రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అలాగే పెరిగిన డీజిల్‌ ధరలతో దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ల బాడుగలు ఈ ఏడాది పెరిగిపోయాయి. ట్రాక్టర్‌ బాడుగ గంటకు రూ.600 నుంచి రూ.1100లకు పెరిగింది. అలాగే ఎరు వులు, కూలీ ధరలు పెరడగంతో వేరుశనగ పంట సాగుకు పెట్టుబడి రెట్టింపై రైతులు ఆర్థిక ఇబ్బందులను భరిస్తూనే పంటసాగుకు సంసిద్ధ మయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారైనా పంట బాగా పండుతున్న ఆశతో రైతులు వేరుశనగ సాగు చేస్తున్నారు. వారి ఆశలు నెరవేరాలని దేవుడి దీవెనలు రైతన్నలకు బాగా ఉండాలని ఆశిద్దాం. ఖరీఫ్‌ పంటల  సాగుతో గ్రామాల్లో  సందడి నెలకొంది.   

Updated Date - 2022-06-28T04:58:01+05:30 IST