ముమ్మరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2021-03-04T06:15:38+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగు తోంది. రాజకీయ పక్షాల నేతలు ఎవరికి వారుగా సభలు, సమావే శాలు నిర్వహించుకుటూ ప్రచారంలో పాల్గొంటున్నారు.

ముమ్మరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
రామ్నపేట మండలం వెల్లంకిలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

రాజాపేట/ భూదాన్‌పోచంపల్లి/ మోత్కూరు/ ఆత్మకూరు(ఎం)/ రామన్నపేట/ సంస్థాన్‌ నారాయణపురం/భువనగిరి టౌన్‌, మార్చి 3: జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగు తోంది. రాజకీయ పక్షాల నేతలు ఎవరికి వారుగా సభలు, సమావే శాలు నిర్వహించుకుటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి అందరూ కృషి చేయాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కోరారు. బుధవారం రాజాపేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటరు ఇన్‌చార్జుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి కోరారు. భూదాన్‌పోచంపల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం  పాటి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామి పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తరపున బీజేపీ, బీజేవైఎం నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మేకల చొక్కారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఏలూరి శ్యాం పాల్గొన్నారు. మోత్కూరులో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నెబోయిన రమేష్‌, గజ్జి మల్లేష్‌ ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి తరపున రైల్వేబోర్డు సభ్యుడు కొణతం నాగార్జునరెడ్డి, నాయకులు బొట్టు అబ్బయ్య, దొంతి నర్సింహారెడ్డి ప్రచారం చేశారు. ఆత్మ కూరు(ఎం) మండలంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌కు మద్ద తుగా పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. రామన్నపే టలో టీజేఎస్‌ అధినేత ఎం.కోదండరాం విజయాన్ని ఆకాంక్షిస్తూ  ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేశపాక శ్రీనివాస్‌, నాయకులు మొగుడంపల్లి ఆశప్ప, చిప్పలపల్లి మధు పాల్గొన్నారు. రాజేశ్వర్‌రెడ్డికి మద్దతుగా  టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి, శోభన్‌, మండల  గుత్త నర్సింహారెడ్డి, బందెల రాములు ప్రచారం నిర్వహించారు. రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో వామపక్షాల అభ్యర్థి జయసాఽథిరెడ్డికి మద్దతుగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి జెలెల్ల పెంటయ్య, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు బొడ్డుపల్లి వెంకటేశం, ఆనగంటి వెంకటేశం పాల్గొన్నారు. సంస్థాన్‌నారాయణపురంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల నారయకులు వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు.  భువనగిరిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి తరపున మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన అంజనేయులు, సింగిల్‌ విండో చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి జి.ప్రేమేందర్‌రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పీవీ.శ్యాంసుందర్‌రావు, నర్ల నర్సింగ్‌రావు, చందా మహేందర్‌గుప్త, పి.ఉమాశంకర్‌రావు ప్రచారం చేశారు.  కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌ విజయం కోసం మునిసిపల్‌ మాజీ చైర్మ న్‌ బర్రె జహంగీర్‌ ఆధ్వర్యంలో, యువ తెలంగాణ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డికి శాసన మండలి సభ్యురాలిగా అవకాశం కల్పించాలని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు శీలం క్రాంతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.  వామపక్షాల అభ్యర్థి విజయసారథిరెడ్డి, టీజేఏసీ అ భ్యర్థి ప్రొఫెసర్‌ కోదండరాంకు మద్దతుగా ఆయా పార్టీల నాయ కులు ప్రచారం చేశారు. స్వతంత్య్ర అభ్యర్థులు పూస శ్రీనివాస్‌, గూడూరు యశోధర ప్రచారం చేశారు. వలిగొండలో రాణిరుద్రమ తరపున యువతెలంగాణ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. చౌ టుప్పల్‌లో రాజేశ్వర్‌రెడ్డికి మద్దతుగా మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, కౌన్సిలర్లు బాబాషరీ్‌ఫ్‌, లింగస్వామి, శిరీషా ప్రచారం చేశారు.

Updated Date - 2021-03-04T06:15:38+05:30 IST