ముమ్మరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2021-03-06T04:42:14+05:30 IST

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం డిమాండ్‌ చేశారు.

ముమ్మరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఎమ్మెల్సీ అభ్యర్థి కరపత్రాలను పంపిణీ చేస్తున్న అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం

గద్వాల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం డిమాండ్‌ చేశారు. జింకలపల్లిలో శుక్రవారం నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తోందని ఆరో పించారు. పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి దేవి ఉన్నత విద్యావంతురాలని, నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని అన్నారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్‌ అధ్యక్షుడు రాందేవ్‌రెడ్డి, జడ్పీటీసీ హన్మంతరెడ్డి, సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, వీరన్న, నాయకులు శ్రీధర్‌రెడ్డి, శ్రీనాధ్‌రెడ్డి, గిడ్డారెడ్డి, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 

వాణీదేవికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్న సురభి వాణీదేవి విద్యావంతురాలని, మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత కోరారు. గద్వాల మండలంలోని పూడూరు గ్రామంలో శుక్రవారం ఆమె ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు తిరుతయ్య, నాగర్‌దొడ్డి వెంకట్రాములు తదితరులు ఉన్నారు.

వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు ఇవ్వాలి

అలంపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి వాణిదేవికి మొదటి ప్రాధాన్య ఓటు ఇవ్వాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. అలంపూర్‌ చౌరస్తాలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన న్యాయవాదుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు నారాయణరెడ్డి, తిమ్మారెడ్డి, నాగయ్య, నాగరాజు యాదవ్‌, సురేష్‌కుమార్‌శెట్టి, రాజేశ్వరమ్మ, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, శాంతిమల్లప్ప, పకీర్‌రెడ్డి, మహ్మద్‌బాష, యాకూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఊపందుకున్న ఎన్నికల ప్రచారం

మల్దకల్‌: మల్దకల్‌ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా సర్పంచ్‌ యాకోబు, నరేందర్‌, వెంకటన్న, మధు, అజయ్‌, నరేశ్‌, తిమ్మప్ప, కిష్టన్న ప్రచారం చేశారు. మండలంలోని నాగర్‌దొడ్డిలో సవారప్ప, సరోజమ్మ, మహేశ్‌, సోమశేఖర్‌రెడ్డి, యోబు, మధుసూదన్‌గౌడ్‌ పట్టభద్రులను కలిసి ఓటు అర్థించారు. అలాగే ఆచార్య నాగేశ్వర్‌కు తొలి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాయ కులు ప్రచారం చేశారు. కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా కార్యదర్ళి నర్సింహ, పాంటన్న, సామేలు, నర్సింహ, బద్రి, ఉలిగేశ్‌, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. 

వడ్డేపల్లి: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా శుక్రవారం శాంతినగర్‌లో టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్‌ కురవ పల్లయ్య ఆధ్వర్యంలో ప్ర చారం నిర్వహించారు. శాంతినగర్‌లోని పాలిటెక్నికల్‌, డిగ్రీ, ప్రైవేట్‌ విద్యాసంస్థలలో పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో టీఆర్‌ ఎస్వీ నాయకులు రవి, సురేష్‌, రాజశేఖర్‌, సురేందర్‌ పాల్గొన్నారు. 

- ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎల్‌.రమణను గెలిపించాలని అలంపూర్‌ తాలుకా ఇన్‌చార్జి ఆంజనేయులు పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. శాంతినగర్‌ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పూర్ణచందర్‌రావు, మద్దిలేట్టి, చాణక్య, సుఽధాకర్‌గౌడు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

అయిజ: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా అయిజ మం డలంలోని సంకాపూర్‌లో సర్పంచ్‌ సుజాత, పార్టీ జిల్లా కన్వీనర్‌ పల్లయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాణీదేవికి తొలి ప్రాధాన్యం ఓటు ఇవ్వాలని పట్టభ ద్రులను కోరారు. 

గద్వాల టౌన్‌: ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యం ఓటును వేయాలని కేటీదొడ్డి ఎంపీపీ మనోరమ కోరారు. గద్వాల పట్టణంలో నివాసముంటున్న కేటీ దొడ్డి మండలానికి చెందిన పట్టభద్రులను శుక్రవారం ఆమె కలిసి ఓట్లు అర్థించారు. కార్యక్రమంలో చక్రధర్‌, ఎంపీటీసీ మహేష్‌ ఉన్నారు. 

గట్టు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు మద్దతుగా గట్టులో శుక్రవారం ప్రజాసంఘాల నాయకులు ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి ఓట్లు అర్థించారు. ప్రభు త్వాన్ని ప్రశ్నించే గొంతుకను శాసనమండలికి పంపుదామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.నర్మద కోరారు. కార్యక్రమంలో అవాజ్‌జాఫర్‌, యూనుస్‌, కేవీపీఎస్‌ నాయకులు సురేశ్‌, ఈరన్న, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. 

 - కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి మద్దతుగా పట్టణంలో కాంగ్రెస్‌ నాయకులు వీరుబాబు, ఎండీ ఇషాక్‌, వెంకటేశ్‌ ప్రచారం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయుల మద్దతు కోరారు. వారి వెంట కౌసర్‌బేగ్‌, అన్వర్‌, దీపక్‌కుమార్‌ ఉన్నారు. 




Updated Date - 2021-03-06T04:42:14+05:30 IST