ముమ్మరంగా రిజిస్ర్టేషన్లు

ABN , First Publish Date - 2022-06-26T05:09:04+05:30 IST

దర్శి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వారంరోజులుగా రిజిస్ట్రేషన్‌లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ముమ్మరంగా రిజిస్ర్టేషన్లు

రోజుకు వంద లావాదేవీలు

అమ్మకం, కొనుగోలుదారులతో కిటకిట

దర్శి, జూన్‌ 25 :  దర్శి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వారంరోజులుగా  రిజిస్ట్రేషన్‌లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి జూన్‌ 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌లను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కొను గోళ్లు, అమ్మకాలు సాగక వందలాది మంది ఇబ్బంది పడ్డారు. కోర్టు ఉత్త ర్వులతో రిజిస్ట్రేషన్‌లకు మార్గంసుగమం అయింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు దర్శి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో 600లకు పైగా రిజిస్ట్రేషన్‌ లు జరిగాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రోజుకు వంద 100 రిజిస్ట్రేషన్‌లు అవుతున్నాయి. ప్రతి రోజూ  అమ్మకం, కొనుగోలు దారులతో కార్యాలయం రద్దీగా కన్పిస్తోంది. 


Updated Date - 2022-06-26T05:09:04+05:30 IST