ltrScrptTheme3

ముమ్మరంగా పునరుద్ధరణ చర్యలు : కలెక్టర్‌

Nov 25 2021 @ 00:56AM

అనంతపురం, నవంబరు24(ఆంధ్రజ్యోతి): జిల్లా లో తుఫాన ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని కలెక్టర్‌ నాగలక్ష్మి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డికి వివరించారు.   బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కా ర్యా లయం నుంచి తుఫాన ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై జిల్లా అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ నుంచి కలె క్టర్‌ పాటు డీఆర్వో గాయత్రీదేవి, నగరపాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, హౌసింగ్‌ పీడీ కేశవనాయుడు, పీఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంక టరమణ, డీఎంహెచఓ కామేశ్వరప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన సహాయక, పునరుద్ధ రణ చర్యలను ముఖ్యమంత్రికి కలెక్టర్‌ వివరించారు. జి ల్లాలో వర్షాల వల్ల ఏడుగురు మరణించారని, వారిలో ఆరు కుటుంబాలకు పరిహారం చెల్లించినట్టు తెలిపారు. కదిరిలో భ వనం కూలి మరణించిన ఆరుగురికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు చొప్పున మొత్తం రూ. 30 లక్షలు చెల్లించామన్నారు. మరో మృతుడి కుటుంబసభ్యుల వివరాలు తె లియాల్సి ఉందని, వెంటనే బాధిత కుటుంబానికి పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయంతో పాటు అవసరమైతే జగనన్న కాలనీల్లో ఇంటిని మంజూరు చేస్తామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల కోసం జిల్లా వ్యా ప్తంగా 9 రిలీఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లాలో 40 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. 1500 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని సమగ్ర పరిశీలన అనంతరం నివేదికలు పం పుతామన్నారు. జిల్లాలో 8 పాడి పశువులు, 100 మేక/గొర్రెలు, 2 వేల వరకూ కోళ్లు మరణించాయన్నారు. వాటికి సైతం పరిహారం చెల్లిస్తామన్నారు. జిల్లాలో పశు వుల నష్టానికి సంబంధించి మొత్తం రూ. 5.07 లక్షల పరి హారం చెల్లించనున్నామని తెలిపారు. పాలిచ్చే ఆవు ,గేదెకు రూ. 30 వేలు, వట్టిపోయిన ఆవు, గేదెకు రూ. 25 వేలు, లేగదూడలకు రూ. 16 వేలు, గొర్రె, మేకలకు రూ. 3 వేలు, ఒక్కో కో డికి రూ. 50 చొప్పున నష్టపరిహారం అందించను న్నా మన్నారు. పంచాయతీ రోడ్లకు సంబంధించి మర మ్మతులు పూర్తి చేస్తామన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులు వారంతానికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి వివరించారు.


సహాయక చర్యలు ముమ్మరం చేయాలి

జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబంధిత అధికారులను బుధవారం ప్రకటన ద్వారా ఆదేశించారు. తాగునీరు, విద్యుత సరఫరాకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. తాగునీటి అంశాన్ని అధికారులు సీరియ్‌సగా తీసుకోవాలన్నారు. 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన వినతులపై వెంటనే స్పందించాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈనెల 26 నుంచి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అదికారులు తెలిపిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.