ఆరువందల మిలియన్ల క్లబ్‌లో.. ‘అల వైకుంఠపురములో‌‌’ని పాట

May 4 2021 @ 19:44PM

2020 సంవత్సరంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంలోని పాటలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్‌ ఇప్పటికీ వైరల్‌ అవుతూనే ఉంది. ఈ పాట విడుదలైనప్పటి నుంచి వరుస రికార్డులతో టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట 600 మిలియన్ల వ్యూస్‌ సాధించి.. మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. థమన్‌ మ్యూజిక్‌ అందించారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా పాటలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. తాజాగా ఈ పాట 600 మిలియన్ల వ్యూస్‌ సాధించినట్లుగా.. ఆదిత్య మ్యూజిక్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. 


''లోకల్‌ దొరబాబు నుంచి డేవిడ్‌ వార్నర్‌ వరకు.. మొత్తం ప్రపంచంలోని 600 మిలియన్ల మనసులను బుట్టబొమ్మ సాంగ్‌ అలరించింది.. ఇలాగే 1 బిలియన్‌ చేరుకుంటుందా?.. అవునో.. కాదో.. కామెంట్స్‌లో చెప్పండి'' అని ఆదిత్య మ్యూజిక్‌ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది. దీనికి నెటిజన్లు 'నో డౌట్‌.. త్వరలోనే ఆ మార్క్‌ను అందుకుంటుంది..' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

 
Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.