సీతాకోకచిలుక!

ABN , First Publish Date - 2021-06-21T06:51:46+05:30 IST

పేపర్‌ ప్లేటు, షేవింగ్‌ క్రీమ్‌, పెయింట్‌, కత్తెర, క్రాఫ్ట్‌ స్టిక్స్‌ లేదా కార్డ్‌బోర్డ్‌ ముక్కలు, జిగురు, మార్కర్‌, పైప్‌ క్లీనర్‌, గూగ్లీ కళ్లు.

సీతాకోకచిలుక!

  • కావలసినవి

పేపర్‌ ప్లేటు, షేవింగ్‌ క్రీమ్‌, పెయింట్‌, కత్తెర, క్రాఫ్ట్‌ స్టిక్స్‌ లేదా కార్డ్‌బోర్డ్‌ ముక్కలు, జిగురు, మార్కర్‌, పైప్‌ క్లీనర్‌, గూగ్లీ కళ్లు.

   ఇలా  చేయాలి...

ముందుగా పేపర్‌ ప్లేటు వెనకాల షేవింగ్‌ క్రీమ్‌ పూసి ఆరేంత వరకు పక్కన పెట్టాలి.

తరువాత పేపర్‌  ప్లేటును సగానికి కట్‌ చేసుకోవాలి. కట్‌ చేసిన ఒక్కో భాగం సీతాకోకచిలుక రెక్క ఆకారంలోకి వచ్చేలా కత్తిరించాలి. 

ఇప్పుడు జిగురు సహాయంతో క్రాఫ్ట్‌ స్టిక్‌ లేదా కార్డ్‌బోర్డ్‌ ముక్కకు రెండు రెక్కలు అతికించాలి. 

పైప్‌ క్లీనర్‌ ముక్కలను క్రాఫ్ట్‌ స్టిక్‌ పైభాగంలో అతికించాలి. దీంతో సీతాకోకచిలుక ఆకారం రెడీ అయినట్టే!

చివరగా మార్కర్‌తో సీతాకోకచిలుక ముఖం, రెక్కలపై డిజైన్స్‌ గీయాలి. గూగ్లీ కళ్లను అతికించాలి.

Updated Date - 2021-06-21T06:51:46+05:30 IST