అదే దోపిడీ

ABN , First Publish Date - 2020-10-30T10:28:50+05:30 IST

రైతులు ఆరుగాలం శ్రమిం చి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు సవాలక్ష షరతులు అడ్డువస్తున్నాయి.

అదే దోపిడీ

ధాన్యం తూకంలో మళ్లీ మోసపోతున్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రైతాంగం 

బస్తా స్థానంలో ఒక కిలో ధాన్యం కాటా వేస్తున్న వైనం

40 కిలోల బస్తాకు 41 కిలోల ధాన్యం సేకరణ

600 గ్రాముల బస్తా బరువుకు కిలో ధాన్యం సేకరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు


బోధన్‌, అక్టోబరు 29 : రైతులు ఆరుగాలం శ్రమిం చి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు సవాలక్ష షరతులు అడ్డువస్తున్నాయి. ప్రభుత్వ ధాన్యం కొనుగో లు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించుకొని రైతులు లాభపడాలని అటు అధికారులు.. ఇటు ప్రజాప్రతిని ధులు చెబుతున్నా.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని  కొనుగోలు కేంద్రాలలో రైతులకు తెలియకుండానే తీవ్ర దోడిడీ జరుగుతోంది. గతంలో కొనుగోలు కేంద్రాలలో 40కిలోల బస్తాకు ధాన్యం కాటా జరిపితే ఖాళీ బస్తా ను కాటాలో తూకం వేసేవారు. బస్తా స్థానంలో ఖాళీ బస్తా తూకం జరిగేది. కానీ ఈ పర్యాయం కొనుగోలు కేంద్రాలలో కొత్త తరహా దోపిడీ తెరపైకి వచ్చింది. ఒ క్కో క్వింటాలుకు రైతు కిలో ధాన్యాన్ని ఉట్టి పుణ్యానికి ఖాళీ బస్తా రూపంలో కోల్పోవాల్సిన దుస్థితి వచ్చింది. రైతులకు తెలియకుండానే రైతుల ధాన్యాన్ని కాజేస్తు న్నారు. అదేమిటని ప్రశ్నిస్తే అధికారులు నోటిమాటకు చెప్పారని, ఎక్కడా ఆదేశాలు లేవని తెలుపుతున్నారు.


మౌఖికంగా ఇచ్చిన ఆదేశాల మేరకే తూకంలో బస్తా స్థానంలో ఖాళీ బస్తా వేయాల్సింది పోయి అదనంగా కిలో ధాన్యాన్ని తూకం వేస్తుండడం గమన్హారం. గతం లో ఇలాంటి ప్రక్రియ ఎప్పుడూ జరగలేదు. ఖాళీ ధా న్యం బస్తా బరువు 600 గ్రాముల నుంచి 700 గ్రామ లలోపు ఉంటుంది. 40 కిలోల బస్తాకు ఒక కిలో ధా న్యం అదనంగా తీసుకుంటుం న్నారంటే బస్తా బరువు కు మించి 300 గ్రాములపైనే ధాన్యాన్ని అదనంగా తీ సుకుంటున్నారు. అంటే క్వింటాలుకు ఒక్కోరైతు నుం చి కిలో ధాన్యం బస్తాల రూపంలో కాజేసే పర్వం సా గుతోంది. లెక్క ప్రకారం క్వింటాలు ధాన్యం కాటాకు రెండు బస్తాలను తూకం వేయాలి. రెండు ఖాళీ బస్తా లు అంటే 1200 గ్రాముల బరువు జోకుతుంది. 80 కి లోల ధాన్యం బస్తాకు 800 గ్రాములు ధాన్యం అదనం గా తీసుకుంటుంన్నారు. అంటే క్వింటాలుకు కిలో ధా న్యం అదనంగా రైతుల నుంచి తీసుకుంటున్నారు.


ధా న్యం తూకంలో బస్తా స్థానంలో ఖాళీ బస్తాను వేసి తూకం వేసే పద్ధతిని తొలగించి అదనంగా 40కిలోల ధాన్యం స్థానంలో 41 కిలోల ధాన్యం తీసుకోవడం వి వాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై రైతులు గుర్రుగా ఉన్నారు. చిన్నాచితక రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఇలాంటి నిబంధనలు తీవ్ర అడ్డంకిగా మా రాయి. 40 కిలోల బస్తాకు 41 కిలోల ధాన్యం సేకరిస్తు ండడం ఖాళీ బస్తాకు రెట్టింపులో ధాన్యం తీసుకుం టు ండడం రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తోంది. ఒక్కో లోడ్‌ ధాన్యం లారీలో వేలాది రూపాయలు రైతుకు న ష్టం వాటిల్లుతోంది. ఈలెక్కన ధాన్యం కొనుగోలు కేం ద్రాలలో రైతులు ఒక్క కిలో రూపంలో పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తోంది. 


బస్తానే తూకం వేయాలంటున్న రైతులు

40కిలోల బస్తా ధాన్యాన్ని కాటా జరిపేటప్పుడు కొ నుగోలు కేంద్రాలలో బస్తా స్థానంలో ఖాళీ బస్తానే తూకం వేయాలని, కిలో ధాన్యాన్ని అదనంగా తీసుకో వడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త నిబంధ నలతో రైతులకు నష్టం వాటిల్లేలా చేయడం ఏమిటని మండిపడుతున్నారు. క్వింటాలుకు ఒక కిలో ధాన్యమే నని అధికారులు చెబుతున్నప్పటికీ ఒక్కో రైతుకు ఎం త నష్టం జరుగుతుందో అధికారులు అంచనా వేయా లని రైతులు సూచిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో కొత్త నిబంధనల పేరిట రైతులను నష్టపర్చవద్దని కో రుతున్నారు. బస్తా స్థానంలో ఖాళీ బస్తా తూకం వే యాలని, కిలో ధాన్యం తీసుకునే పద్ధతిని మానుకోవా లని డిమాండ్‌ చేస్తున్నారు.


జిల్లా ఉన్నతాధికారులు ఆ దేశాలు ఇచ్చారని కింది స్థాయిలో సహకార సొసైటీల పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో ఖాళీ బస్తా స్థానం లో కిలో ధాన్యం అదనంగా సేకరణ రైతుకు నష్టదా యకంగా మారింది. ఇది అధికారుల నిర్ణయమంటూ దానిని సాకుగా చూపి రైతులను నిండా ముంచుతు న్నారని వాపోతున్నారు. ప్రైవేటు వ్యాపారులు, దళారు లు జరిపే దోపిడీ బహిరంగమైతే.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో నిబంధనల బూచితో రైతులను దోచుకుం టున్నారని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై రై తులు క్షేత్రస్థాయిలో గ్రామాలలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బస్తా స్థానంలో ఖాళీ బస్తా తూకం వేయాలని, అదనంగా ఒక కిలో ధాన్యాన్ని తీ సుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చే స్తున్నారు. 


అధికారులు చెప్పిందే చేస్తున్నాం..నారాయణ, సీఈవో, కోటగిరి సహకార సొసైటీ

ధాన్యం కాటాలో బస్తా స్థానంలో ఖాళీ బస్తా వేయకుండా అదనంగా కిలో ధా న్యం తీసుకోవాలనేది ఉన్నతాధికారులు చెప్పిన నిర్ణయం. పైఅధికారులు చెప్పిందే కింది స్థాయిలో చేస్తున్నాం. గతంలో ఈ నిబంధన లేకపోయినా ఈ ఏడాది సమా వేశాలలో అధికారులు తమకు చెప్పిన సూచనలే కిందిస్థాయిలో పాటిస్తున్నాం. 40 కిలోల బస్తాకు ఖాళీ బస్తా తూకం వేయకుండా కిలో ధాన్యాన్ని అంటే.. 41 కిలోలు తూకం వేస్తున్నాం. ఉన్నతాధికారుల నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం. 

Updated Date - 2020-10-30T10:28:50+05:30 IST