రూ.250 కోట్లతో Buyback of Granules shares

ABN , First Publish Date - 2022-08-10T05:43:58+05:30 IST

గ్రాన్యూల్స్‌ ఇండియా షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. 62.5 లక్షల వరకు షేర్లను వెనక్కి కొనుగోలు (బైబ్యాక్‌) చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

రూ.250 కోట్లతో  Buyback of Granules shares

త్రైమాసిక లాభం రూ.128 కోట్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్రాన్యూల్స్‌ ఇండియా షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. 62.5 లక్షల వరకు షేర్లను వెనక్కి కొనుగోలు (బైబ్యాక్‌) చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ ఈక్విటీలో బైబ్యాక్‌ షేర్ల వాటా 2.52 శాతం ఉంటుందని గ్రాన్యూల్స్‌ వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌కు రూ.400 చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. దీని ప్రకారం గరిష్ఠ షేర్ల బైబ్యాక్‌కు రూ.250 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.128 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.120 కోట్ల తో పోలిస్తే 6 శాతం పెరిగినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిగురుపాటి కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.850 కోట్ల నుంచి రూ.1,020 కోట్లకు చేరింది. నికర లాభం మార్జిన్‌ మాత్రం 14ు నుంచి 13 శాతానికి తగ్గింది. ఏడాది క్రితంతో పోలిస్తే మొత్తం ఆదాయంలో యూరప్‌ ఆదాయం 16.8 శాతం నుంచి 22.5 శాతానికి చేరిందని కృష్ణ చెప్పారు. 

Updated Date - 2022-08-10T05:43:58+05:30 IST