వైఫై..వెరిఫై!..రౌటర్‌ కొంటున్నారా?

ABN , First Publish Date - 2021-04-17T06:06:06+05:30 IST

కరోనాతో మన జీవనశైలిలో ఆసాంతం మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఏడాది ఆరంభమైన విపత్తు కనుచూపుమేరలో సద్దుమణిగే అవకాశం కనిపించటం లేదు. ఇంటి నుంచే కార్యాలయం పని, చదువులు, కొనుగోళ్ళు... ఒక్కటనేమిటి సమస్తం

వైఫై..వెరిఫై!..రౌటర్‌ కొంటున్నారా?

కరోనాతో మన జీవనశైలిలో ఆసాంతం మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఏడాది ఆరంభమైన విపత్తు కనుచూపుమేరలో సద్దుమణిగే అవకాశం కనిపించటం లేదు. ఇంటి నుంచే కార్యాలయం పని, చదువులు, కొనుగోళ్ళు... ఒక్కటనేమిటి సమస్తం ఇంటర్నెట్‌ అనుసంధానితంగా మారింది.  ఈ కార్యకలాపాలన్నీ సజావుగా సాగాలంటే అత్యంత వేగంతో నెట్‌ కనెక్టివిటీ ఉండాలి. ఇందుకు ఉపయోగపడేది వైఫై రౌటర్‌. దీంతో ఇంటిల్ల్లిపాదీ నెట్‌తో మమేకం కావచ్చు. అయితే రౌటర్‌కు సంబంధించి ప్రాథమిక సాంకేతికతపై అవగాహన ఉంటే మన్నికైన రౌటర్‌ను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. అసలా విషయంలో ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలో, వేటిపై ఏ స్థాయిలో అవగాహన ఉండాలో చూద్దాం...


ప్రపంచం కొత్త ప్రమాణాల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. వైఫై 6 ప్రాథమికంగా 802.11 ఎఎక్స్‌ స్టాండర్డ్‌. దీనిపై పనిచేసే స్మార్ట్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌టా్‌పలు తక్కువ బ్యాటరీని ఉపయోగించుకుంటాయి.


రౌటర్‌, మోడెమ్‌ మధ్య తేడా మొదట తెలుసుకోవాలి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసినప్పుడు ప్రత్యేకించి ‘రౌటర్‌ నాట్‌ మోడెమ్‌’ అని వాటిపై ఉంటుంది. ఇదే సదరు రెంటికీ తేడా తెలుసుకోవాలన్న ఆసక్తిని కలుగజేస్తుంది. నిజానికి మోడెమ్‌ కమ్‌ రౌటర్‌ పరికరాన్ని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ సమకూరుస్తారు. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే సాంకేతికంగా ఈ రెంటికీ తేడా ఉంది. వైర్డ్‌, వైర్‌లె్‌సగా ఇంటర్నెట్‌ సర్వీ్‌సను రౌటర్‌ అందిస్తుంది. అదే మోడెమ్‌ కోసం టి3 కేబుల్‌ లైన్‌ లేదా ఫైబర్‌ ఆప్టిక్‌ అవసరమవుతుంది. రౌటర్‌తో అనేకానేక పరికరాలకు నెట్‌ సేవలు అందుతాయి. ప్రధాన సరఫరా కోసం మోడెమ్‌ అవసరమవుతుంది. అందుకని సర్వీస్‌ ప్రొవైడర్‌తో ఈ విషయమై మాట్లాడటం చాలా మంచిది. 


  • 2.4జిహెచ్‌జెడ్‌, 5జిహెచ్‌జెడ్‌ వేవ్‌లెంథ్‌కు సంబంధించినవి. సాధారణ పరిభాషలో బ్యాండ్స్‌ అంటారు. 2.4జిహెచ్‌జెడ్‌ రేంజ్‌ తక్కువ, వేగం ఎక్కువ.  
  • 5జిహెచ్‌జెడ్‌ అందుకు విరుద్ధం. ఒక్కమాటలో చెప్పాలంటే  5జిహెచ్‌జెడ్‌ వైఫై నెట్‌వర్క్‌ 5జి మొబైల్‌ నెట్‌వర్క్‌ కుదరదు. 
  • సింగిల్‌ బ్యాండ్‌ రౌటర్‌  2.4జిహెచ్‌జెడ్‌ని ఆపరేట్‌ చేస్తుంది, గరిష్ఠ వేగం 300 ఎంబిపిఎస్‌. రేంజ్‌ అంటే దూరం ఎక్కువే అయినా నెట్‌ వేగం తక్కువ. చిన్నపాటి గృహాలకు ఇది చాలు. డ్యూయల్‌ బ్యాండ్‌తో పలు డివైజెస్‌లతో కనెక్ట్‌ కావచ్చు. రేంజ్‌, వేగం రెండూ ఎక్కువే. పెద్ద గృహాలకు ఇది బాగుంటుంది. 
  • మల్టీ స్టోర్డ్‌ బిల్డింగ్స్‌కు వ్యయభరితమైనప్పటికీ ట్రై బ్యాండ్‌ ఉపయోగపడుతుంది. అదనంగా 5జిహెచ్‌జడ్‌ బ్యాండ్‌కు తోడు నెట్‌ స్పీడ్‌ 11000ఎంబిపిఎస్‌ ఉంటుంది. 
  • భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైఫై 6ని ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. ప్రపంచం కొత్త ప్రమాణాల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. వైఫై 6 ప్రాథమికంగా 802.11 ఎఎక్స్‌ స్టాండర్డ్‌. దీనిపై పనిచేసే స్మార్ట్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌టా్‌పలు తక్కువ బ్యాటరీని ఉపయోగించుకుంటాయి. 6జిహెచ్‌జెడ్‌ ఎక్స్‌టెండెండ్‌ బ్యాండ్‌గా భావించవచ్చు. అయితే అందుకు తగ్గ డివైజెస్‌లను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. 
  • వైఫై 802.11 ఎసి ప్రమాణం లేదా ఎసి సిరీస్‌ రౌటర్లు సాధారణంగా రెండూ అంటే డ్యూయల్‌, ట్రైబ్యాండ్‌ కాన్ఫిగరేషన్స్‌తో ఉంటాయి. మల్టీ ఇన్‌ - మల్టీ ఔట్‌ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఇప్పటి అవసరాలకు అనుగుణంగా, అందుబాటులోని బ్యాండ్‌విడ్త్‌ను అనుసరించి పరికరాలకు కనెక్టివిటీని ఈ సాంకేతికత అందించగలుగుతుంది. 
  • వైఫై 802.11 ఎన్‌ లేదా ఎన్‌ సిరీస్‌ - డ్యూయల్‌ బ్యాండ్‌ కాన్ఫిగరేషన్‌ తో లభ్యమవుతాయి. మల్టీ ఇన్‌ - మల్టీ ఔట్‌ టెక్నాలజీని కలిగి ఉంటాయి. వాస్తవానికి అవి ఎక్కువ యాంటెన్నాలు తద్వారా మంచి వేగం, కవరేజ్‌ని ఇవ్వగలుగుతాయి. 
  • వైఫై 802.11 ఎఎక్స్‌ లేదా ఎక్స్‌ సిరీస్‌- వైఫై 6గా భావిస్తారు. బై డైరెక్షనల్‌ మల్టీ ఇన్‌ - మల్టీ ఔట్‌ టెక్నాలజీని కలిగి ఉంటాయి. గేమింగ్‌ లేదా 4కె స్ట్రీమింగ్‌, విఆర్‌ కంటెంట్‌కు ఇవి సూటబుల్‌గా ఉంటాయి. 
  • ఇతర మోడ్‌కు కొనుగోలు చేసిన వైఫై ఉపయోగపడుతుందా లేదా అన్నది చెక్‌ చేసుకవాలి. యాక్సెస్‌ పాయింట్‌, రిపీటర్‌, ఎక్స్‌టెండర్‌గా మిగిలిపోకూడదు. 
  • ఆర్‌జె45/ ఇథర్‌నెట్‌ పోర్ట్స్‌ ఎక్కువగా ఉన్నవి భవిష్యత్తులోనూ ఉపయోగపడతాయి. డెడికేటెడ్‌ యుఎ్‌సబి పోర్ట్‌ ఉందా లేదా అన్నది చెక్‌ చేసుకోండి. ఎక్స్‌టర్నల్‌ డ్రైవ్స్‌ కనెక్టింగ్‌ కోసం, ఎఫ్‌టిపి డేటా ట్రాన్స్‌ఫర్‌కు ఉపయో
  • గపడాలి.
  • బడ్జెట్‌లో లభించే రౌటర్లలోనూ మాల్వేర్‌లను తట్టుకునే బిల్ట్‌ ఇన్‌ ఫైర్‌వాల్‌ ఉంటుంది. కొన్నింటిలో యాంటివైరస్‌ ప్రోగ్రామ్‌లు ఉంటాయి. 
  • అధిక యాంటెన్నాలు కలిగిన న్యూ రౌటర్‌ ఇంటర్నెట్‌ సంబంధ ప్రాబ్లెమ్స్‌ను సాల్వ్‌ చేయలేదని గుర్తించాలి. రేంజ్‌ విషయమై వైఫై ఎక్స్‌టెండర్‌  మాత్రమే బూస్ట్‌ చేయగలుగుతుంది. అవి సింగిల్‌, డ్యూయల్‌ బాండ్‌ కాన్ఫిగరేషన్స్‌తో లభ్యమవుతాయి.
  • ఎక్స్‌టెండర్లు మాదిరివే వైఫై రిపీటర్లు. వైర్‌లె్‌సగానే నెట్‌వర్క్‌తో అనుసంఽధానమవుతాయి. మంచి రేంజ్‌, వేగం కోసం సిగ్నల్‌ను రీబ్రాడ్‌కాస్ట్‌ చేస్తాయి.

Updated Date - 2021-04-17T06:06:06+05:30 IST