బీవీఎస్‌ కాంప్లెక్స్‌ కూల్చివేత

ABN , First Publish Date - 2022-01-23T05:16:01+05:30 IST

ల్లూరులోని నవాబుపేట వద్దనున్న బీవీఎస్‌ మున్సిపల్‌ కాంప్లెక్స్‌ కూల్చివేత ఒక్క సారిగా ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడున్న 17 షాపులను కూల్చేందుకు సిటీప్లానింగ్‌ అధికారులు యంత్రాలతో రావడంతో టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కార్యకర్తలు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయగా వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

బీవీఎస్‌ కాంప్లెక్స్‌ కూల్చివేత
కటకటాల వెనుక శ్రీనివాసులు రెడ్డి

నవాబుపేటలో ఉద్రిక్తత 

 పాఠశాల విస్తరణ కోసమన్న ఎన్‌ఎంసీ 

అడ్డుకున్న టీడీపీ శ్రేణులను ఈడ్చుకెళ్లిన పోలీసులు 

బాబాయ్‌, అబ్బాయ్‌ల అంతర్గత పోరే కారణమన్న కోటంరెడ్డి 

నెల్లూరు (సిటీ), జనవరి 22 : నెల్లూరులోని నవాబుపేట వద్దనున్న బీవీఎస్‌ మున్సిపల్‌ కాంప్లెక్స్‌ కూల్చివేత ఒక్క సారిగా ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడున్న 17 షాపులను కూల్చేందుకు సిటీప్లానింగ్‌ అధికారులు యంత్రాలతో రావడంతో టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కార్యకర్తలు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయగా వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో ఆ ప్రాంత మంతా ఉద్రిక్తంగా మారింది. కొన్ని గంటల పాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఒక వ్యక్తిపై కక్షతో మధ్య తరగతి ప్రజలను  ఇలా ఇబ్బందులకు గురి చేయడం తగదని, ఇదంతా బాబాయ్‌, అబ్బాయ్‌ల అంతర్గత పోరే కారణమని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. 

నగరంలోని జలకన్యబొమ్మ కూడలి వద్ద బీవీఎస్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలను విస్తరించాలని కార్పొరేషన్‌లోని సిటీప్లానింగ్‌ అధికారులు  రోడ్డు పై ఉన్న వాణిజ్య దుకాణాలను కూల్చేందుకు ఏసీపీ, టీపీఎస్‌ల బృందం ఎక్స్‌కవేటర్లతో వచ్చారు. 17 దుకాణాల్లో ఆరు ఖాళీగా ఉండటంతో వాటిని నేలమట్టం చేశారు. మిగిలిన వాటిల్లో సామాన్లు ఉండటంతో వాటిని వెంటనే తీసేయాలని సూచించిన అధికారులు కూల్చివేతకు పూనుకున్నారు. బాధితులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం తాము దుకాణాలను తొలగించి పాఠశాల విస్తరణ, కొన్ని దుకాణాలకు మరమ్మతులు చేపట్టేందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఏసీపీ మోహిద్దీన్‌ తెలిపారు.

బాధితులకు అండగా ఉంటాం: కోటంరెడ్డి 

బీవీఎస్‌ మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో అనేక మంది చిరు వ్యాపారులువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. అందులో దుకాణం ఉన్న ఓ వైసీపీకి చెందిన నాయకుడికి డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ మద్దతుగా ఉండటాన్ని సహించలేక మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ కక్షకట్టి  దుకాణాలను కూల్చివేతకు పాల్పడ్డాడని ఆరోపించారు. భాధితులకు తాము అండగా నిలుస్తామని, వారి కోసం లాఠీ దెబ్బలకైనా సిద్ధమని అన్నారు. అక్రమంగా వ్యవహరించిన మున్సిపల్‌ అధికారులు, పోలీసుల తీరును అడ్డుకుంటే తమకు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు తాను, పార్టీ భయపడదని స్పష్టం చేశారు. 

కటకటాల్లోకి కోటంరెడ్డి

అందరూ విస్మయం

నెల్లూరు(క్రైం),జనవరి 22: నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట వద్ద ఉన్న బీవీఎస్‌ బాలికల ఉన్నత పాఠశాలకు ముందు ఉన్న దుకాణాలను తొలగింపును అడ్డుకున్న టీడీపీ నేతలను నవాబుపేట పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అయితే  టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని స్టేషన్‌లోని కటకటాల వెనక్కి పంపడం అందరినీ విస్మయానికి గురిచేసింది. టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో పాటు కువ్వరపు బాలాజీ ఇతర నేతలను స్టేషన్‌కు తరలించారని తెలుసుకున్న  కార్యకర్తలు భారీ సంఖ్యలో నవాబుపేట స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.




.



Updated Date - 2022-01-23T05:16:01+05:30 IST